Nayanthara Birthday Special: హద్దులు చెరిపేసిన లేడీ సూపర్ స్టార్.. సౌత్ టు బాలీవుడ్ జర్నీలో ఆసక్తికర విషయాలు
నయనతార 2023లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా బిజినెస్ చేయడం విశేషం. నవంబర్ 18న (శనివారం) నయనతార తన పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె సౌత్ టు బాలీవుడ్‌కు జర్నీకి సంబంధించిన ఈ ఆసక్తికర విశేషాలు మీ కోసం..

దక్షిణాది నయనతార నటనకు జనాలు పిచ్చెక్కిపోతున్నారు. అటు దక్షిణాది.. అటు ఉత్తరాదిలో తన సత్తాను చాటుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నయన్ నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ సాధించాయి. నయనతారను సౌత్‌లో ‘లేడీ సూపర్‌స్టార్’ అని పిలుస్తారు. ఈ సంత్సరం (2023) నయన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి హిందీ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లు వసూలు చేసింది. నవంబర్ 18న నయనతార తన పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె సౌత్ టు బాలీవుడ్‌కు జర్నీని ఓసారి చూద్దాం.
నయనతార కెరీర్ ఇలా మొదలైంది..
నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. మలయాళీ తల్లిదండ్రులకు కర్ణాటకలో ఆమె జన్మించారు. బాల్యంలో ఎక్కువగా బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్‌లలో గడిపారు. ఆ తర్వాత నయనతార తన కుటుంబంతో కలిసి కేరళలోని తిరువల్లకు షిఫ్ట్ అయింది. మొదట్లో నయనతార యాంకర్‌గా, మోడల్‌గా పనిచేసింది. ఇక్కడ నుండి ఆమె దశ తిరిగిపోయింది.
నయన్ ఇన్‌స్టా పోస్ట్..
View this post on Instagram
20 సంవత్సరాల క్రితం నయనతార సినీ అరంగేట్రం..
తన 19 సంవత్సరాల వయస్సులో.. 2003లో నయనతార మలయాళ చిత్రం మనస్సినక్కరేతో వెండితెరకు పరిచయమయ్యింది, ఇది బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. నయనతార సినీ అరంగేట్రం చేసిన రెండేళ్లలోనే రజనీకాంత్ చిత్రం ‘చంద్రముఖి’ (2005)లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో అగ్ర హీరోల సరసన హిట్ మూవీస్ అందుకుంది.
భర్త విఘ్నేశ్ శివన్, తన కవల పిల్లలతో నయన్..
View this post on Instagram
తన మొదటి బాలీవుడ్ మూవీలో షారుక్ ఖాన్‌తో రొమాన్స్..
2023లో షారుఖ్ ఖాన్ చిత్రం ‘జవాన్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నయనతార. ఇందులో బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరైన షారుఖ్ ఖాన్‌తో రొమాన్స్ చేయడమే కాకుండా యాక్షన్ మోడ్‌లో కూడా కనిపించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘జవాన్’ భారీ హిట్‌ను నమోదుచేసుకోవడం నయనతార కెరీర్‌ను ఆకాశానికి ఎత్తేసింది.
బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్..
బాలీవుడ్ ట్రేడ్ వర్గాల నివేదిక ప్రకారం నయనతార , షారుఖ్ ఖాన్ చిత్రం జవాన్ భారతదేశంలో రూ. 643.87 కోట్ల వ్యాపారం చేసింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆ మూవీ రూ. 1143 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా పేరిట మరో రికార్డు కూడా ఉంది. వసూళ్ల పరంగా, షారుఖ్ ఖాన్ గత చిత్రం ‘పఠాన్’ని కూడా ‘జవాన్’ అధిగమించింది. ఈ విధంగా నయనతార కెరీర్‌లో షారూఖ్ ఖాన్ ‘జవాన్’ ఒక మైలురాయిగా నిలిచింది. దీనికి అట్లీ దర్శకత్వం వహించారు.
రెమ్యునరేషన్ పెంచేసిన నయనతార..
జవాన్ మూవీ హిట్ తర్వాత నయన్ తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఒక్కో మూవీరికి రూ.12 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఎంటరై రెండు దశాబ్ధాలు గడిచిన తర్వాత కూడా నయన్ రేంజ్ ఏటికేడు పెరుగుతోంది తప్ప.. తగ్గకపోవడం విశేషం.
