AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani Tweet: ఆసక్తికరమైన ట్వీట్‌ చేసిన హీరో నాని.. ఇంతకీ ‘రేపు’ ఏ ప్రకటన చేయనున్నారు.?

Nani Tweet: ఇటీవల టాలీవుడ్‌లో టక్‌ జగదీష్‌ చిత్రం హీరో నాని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. టక్‌ జగదీష్‌ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో..

Nani Tweet: ఆసక్తికరమైన ట్వీట్‌ చేసిన హీరో నాని.. ఇంతకీ 'రేపు' ఏ ప్రకటన చేయనున్నారు.?
Nani Tuck Jagadish
Narender Vaitla
|

Updated on: Aug 26, 2021 | 1:55 PM

Share

Nani Tweet: ఇటీవల టాలీవుడ్‌లో టక్‌ జగదీష్‌ చిత్రం హీరో నాని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. టక్‌ జగదీష్‌ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. నాని చేసిన ట్వీట్‌ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. నాని ట్వీట్‌ చేస్తూ.. ‘కాస్త ఎమోషనల్‌గా ఉన్నా నాకు మరోసారి ఓటీటీ విడుదల తప్పడం లేదంటూ’ వ్యాఖ్యానించాడు. దీంతో థియేటర్‌ అసోసియేషన్లు నాని మీద తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే అనంతరం మరోవర్గం ఆయనకు మద్ధతు నిలిచారు. దీంతో ఈ సినిమా నిర్మాతలు చిత్రం విడుదలపై పూర్తి హక్కులు తమవేనని తేల్చి చెప్పారు. దీంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగినట్లు అనిపించింది. అయితే తాజాగా నాని చేసిన ట్వీట్‌ మరోసారి ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

తాజాగా నాని ట్విట్టర్‌ వేదికగా.. ‘రేపు’ (Tomorrow) అని ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ నాని ట్వీట్‌ చేసినట్లు రేపు ఎలాంటి ప్రకటన రానుందన్న క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొని ఉంది. టక్‌ జగదీష్‌ చిత్రానికి సంబంధించి ప్రకటన రానున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక కొందరు నెటిజన్లు సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించనున్నారా.? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ నాని చేసిన ట్వీట్‌కి అర్థమేంటో తెలియాలంటే మరికొద్ది గంటలపాటు ఎదురు చూడాల్సిందే అన్నమాట.

ఇదిలా ఉంటే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న టక్‌ జగదీష్‌ చిత్రంపై భారీగానే అంచనాలున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని మండల రెవెన్యూ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మరి ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేస్తారా.? లేదా.. థియేటర్లలోనే సందడి చేస్తుందా చూడాలి.

నాని ట్వీట్..

Also Read: అమెరికాలో కాల్పుల కలకలం..వాషింగ్టన్ లో దుండగుడి కాల్పుల్లో ముగ్గురి మృతి.. పోలీసు కాల్పుల్లో దుండగుడు హతం

Real Reason: అన్నం తిన్న తర్వాత మీకు కూడా నిద్రగా అనిపిస్తుందా.. దాని వెనుక కారణం తెలుసుకోండి..

Restaurants: జనంలో బయట తినే ధోరణి పెరిగింది.. రెస్టారెంట్లు కళకళలాడుతున్నాయి..తగ్గిన డోర్ డెలివరీలు!