ఓల్డ్ టైటిల్స్‌ నానికి ఏ మాత్రం అచ్చొచ్చాయంటే..!

ఈ ఏడాది సమ్మర్‌లో ‘జెర్సీ’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేచురల్ స్టార్ నాని  ‘గ్యాంగ్ లీడర్‌’తో రెండోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇవాళ విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో నాని నటన అద్భుతం అంటూ రివ్యూ రైటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో నాని ఖాతాలో మరో హిట్ పడిందని అభిమానులు […]

ఓల్డ్ టైటిల్స్‌ నానికి ఏ మాత్రం అచ్చొచ్చాయంటే..!
Follow us

| Edited By:

Updated on: Sep 13, 2019 | 7:10 PM

ఈ ఏడాది సమ్మర్‌లో ‘జెర్సీ’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేచురల్ స్టార్ నాని  ‘గ్యాంగ్ లీడర్‌’తో రెండోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇవాళ విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో నాని నటన అద్భుతం అంటూ రివ్యూ రైటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో నాని ఖాతాలో మరో హిట్ పడిందని అభిమానులు అంటున్నారు. అలాగే మెగాస్టార్‌కు కలిసొచ్చిన గ్యాంగ్ లీడర్ టైటిల్.. నానికి కూడా సెట్ అయిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి చిరుకు అదిరిపోయే హిట్‌ను ఇచ్చిన గ్యాంగ్ లీడర్.. నానికి ఆ రేంజ్ హిట్ ఇస్తుందా..? లేదా..? అని తేలాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

అయితే పాత టైటిల్స్‌ను తన సినిమాలకు పెట్టుకోవడం నానికి కొత్తేం కాదు. ఇప్పటివరకు 24 చిత్రాల్లో నటించిన నాని.. అందులో ఐదు చిత్రాలకు ఓల్డ్ టైటిల్స్‌నే పెట్టుకున్నాడు. అందులో ‘పిల్ల జమిందార్’, ‘జంటిల్‌మన్’, ‘మజ్ను’, ‘దేవదాసు’, ‘గ్యాంగ్ లీడర్‌’ చిత్రాలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వర రావు, జయసుధ, మోహన్ బాబు తదితరులు ప్రధానపాత్రలలో 1980లో వచ్చిన చిత్రం పిల్ల జమిందార్. అప్పట్లో నాగేశ్వరరావుకు మంచి హిట్‌ను ఇచ్చిన ఈ టైటిల్‌.. నానికి కూడా అదే రేంజ్ విజయాన్ని తీసుకొచ్చింది.

ఇక అర్జున్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘జంటిల్‌మేన్’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అదే టైటిల్‌తో నాని హీరోగా వచ్చిన ‘జంటిల్‌మన్’ కూడా మంచి సక్సెస్ అయ్యింది. ఇక ‘జంటిల్‌మన్’ తరువాత నాని నటించిన చిత్రం ‘మజ్ను’ కూడా గతంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన మూవీ టైటిల్ కావడం విశేషం. ఇక ఈ మూవీ కూడా హిట్ అయినప్పటికీ.. నాగార్జున కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘మజ్ను’ రేంజ్ హిట్‌ను నాని సొంతం చేసుకోలేక పోయాడు. ఆ తరువాత నాగార్జునతో కలిసి నాని నటించిన చిత్రం ‘దేవదాస్’. ఈ టైటిల్‌పై టాలీవుడ్‌లో ఇప్పటివరకు నాలుగు చిత్రాలు వచ్చాయి. నాగేశ్వర రావు, కృష్ణ, రామ్‌, నాగార్జున-నాని‌లు ‘దేవదాసు’ టైటిల్‌ను వాడుకున్నారు. వారిలో నాగేశ్వర రావు, రామ్‌లు మాత్రమే హిట్ కొట్టారు. ఇదంతా చూసుకుంటే ఒక్క సినిమా మినహాయిస్తే.. ఓల్డ్ టైటిల్స్‌ నానికి బాగానే కలిసొచ్చాయనే చెప్పొచ్చు.  చూడాలి మరి భవిష్యత్‌లో నాని ఇంకా ఎన్ని ఓల్డ్ టైటిల్స్‌ను తన సినిమాల కోసం వాడుకొని హిట్లను కొడతాడో..!