‘యాక్షన్’ మోడ్‌లో విశాల్.. టీజర్ అదుర్స్!

'యాక్షన్' మోడ్‌లో విశాల్.. టీజర్ అదుర్స్!

తమిళ హీరో విశాల్, దర్శకుడు సుందర్.సి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘యాక్షన్’. ఈ సినిమా టీజర్‌ను కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేశారు. భారీ ఛేజింగ్ సీన్స్‌తో, అద్భుతమైన విజువల్స్‌తో యాక్షన్ ప్రియులకు ఫీస్ట్ ఇచ్చేలా ఉంది. టీజర్ చూస్తుంటే సినిమా షూటింగ్ దాదాపు విదేశాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కథలో కీలకమైన పాత్రలో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య లక్ష్మి, యోగిబాబు, ఆకాంక్ష పూరి, కబీర్‌ […]

Ravi Kiran

|

Sep 13, 2019 | 7:48 PM

తమిళ హీరో విశాల్, దర్శకుడు సుందర్.సి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘యాక్షన్’. ఈ సినిమా టీజర్‌ను కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేశారు. భారీ ఛేజింగ్ సీన్స్‌తో, అద్భుతమైన విజువల్స్‌తో యాక్షన్ ప్రియులకు ఫీస్ట్ ఇచ్చేలా ఉంది. టీజర్ చూస్తుంటే సినిమా షూటింగ్ దాదాపు విదేశాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కథలో కీలకమైన పాత్రలో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య లక్ష్మి, యోగిబాబు, ఆకాంక్ష పూరి, కబీర్‌ దుహాన్‌ సింగ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిప్‌హాప్‌ తమిజా సంగీతం అందిస్తున్నారు. ఆర్‌. రవీంద్రన్‌ నిర్మాత. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu