Nandamuri Family: నందమూరి మల్టీస్టారర్ ఆన్ ది వే.. థియేటర్స్ షేక్ కావాల్సిందే అంటున్న ఫ్యాన్స్

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే మెగా, అక్కినేని మల్టీస్టారర్స్ వచ్చేసాయి. త్వరలోనే దగ్గుబాటి వారి కుటుంబ కథా చిత్రం కూడా రాబోతుంది. ఇక మిగిలింది నందమూరి ఫ్యామిలీ మాత్రమే.

Nandamuri Family: నందమూరి మల్టీస్టారర్ ఆన్ ది వే.. థియేటర్స్ షేక్ కావాల్సిందే అంటున్న ఫ్యాన్స్
Jr Ntr, Kalyan Ram
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2022 | 6:39 PM

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే మెగా, అక్కినేని మల్టీస్టారర్స్ వచ్చేసాయి. త్వరలోనే దగ్గుబాటి వారి కుటుంబ కథా చిత్రం కూడా రాబోతుంది. ఇక మిగిలింది నందమూరి ఫ్యామిలీ మాత్రమే. ఆ మధ్య ఎన్టీఆర్ సినిమాలో బాబాయ్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నటించారు కానీ తమ్ముడితో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఈ లోటు త్వరలోనే తీరబోతుంది. తారక్‌తో అదిరిపోయే మల్టీస్టారర్ అనౌన్స్ చేసారు కళ్యాణ్ రామ్. మరి అది ఎలా ఉండబోతుంది..? ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్‌లో మల్టీస్టారర్స్ సంఖ్య పెరిగిపోయింది. ఇగోలు పక్కనబెడుతున్న హీరోల కోసం.. ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్నారు దర్శకులు. ఇప్పటికే ఆచార్య, బంగార్రాజు లాంటి ఫ్యామిలీ మల్టీస్టారర్స్ వచ్చాయి. నాగార్జున, చైతూ కలిసి నటించిన బంగార్రాజు బానే ఆడింది కానీ చిరు, చరణ్‌కు ఆచార్య పీడకలలా మారిపోయింది. ఇక వెంకటేష్, రానా కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. తాజాగా నందమూరి మల్టీస్టారర్ ప్రకటించారు కళ్యాణ్ రామ్. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో బింబిసార సినిమాను నిర్మిస్తున్నారు కళ్యాణ్ రామ్. పైగా ఈ పాత్ర కోసం తాను కూడా చాలా మారిపోయారు. గడ్డం మీసాలు పెంచేసి.. రాక్షసుడి లుక్‌లోకి మేకోవర్ అయ్యారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగిపోతున్నాయి. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నాలుగు భాగాలుగా రానుందని తెలిపారు కళ్యాణ్. అందులో ఓ భాగంలో కచ్చితంగా తారక్ ఉంటాడని తెలిపారు.

నందమూరి బ్రదర్స్‌ను ఒకే స్క్రీన్‌పై చూడాలని చాలా కాలంగా అభిమానులు కోరుకుంటున్నారు. పైగా కథ నచ్చితే నటిస్తామని తారక్, కళ్యాణ్ ఇద్దరూ చెప్పారు. ఇప్పుడు వశిష్ట్ అది వర్కవుట్ చేస్తున్నారు. బింబిసార రాబోయే భాగాల్లో ఎన్టీఆర్ నటించడం ఖాయమైపోయింది. 2022 ఆగస్ట్ 5న మొదటి భాగం రానుండగా.. 2023 ఆగస్టులో బింబిసార 2 విడుదల కానుంది. ఆ తర్వాత మూడు, నాలుగు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా నందమూరి మల్టీస్టారర్ వస్తే థియేటర్స్ ఊగిపోవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు చదవండి