Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ నుంచి మరో అప్డేట్.. అందాల మహారాణి.. ఐష్ ఎంత బాగుందో..

ప్రతీకారం తీర్చుకునే రాణి నందిని పాత్రలో ఐశ్వర్య కనిపించనుంది. పట్టు చీర, పొడవాటి జుట్టు.. మెడలో ఆభరణాలతో చూపుతిప్పుకొనివ్వకుండా..

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ నుంచి మరో అప్డేట్.. అందాల మహారాణి.. ఐష్ ఎంత బాగుందో..
Aishwarya Rai
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2022 | 6:37 PM

అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కించే సినిమాల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయన రూపొందించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షుకల మనస్సులలో నిలిచిపోయాయి. చాలా కాలం తర్వాత మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). ఈ సినిమాపై ముందు నుంచి భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇందులో విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వ‌ర్యా రాయ్‌, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా హిస్టారికల్ ఎపిక్ మూవీగా వస్తోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇటీవల గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ షూరు చేశారు మణిరత్నం టీం. రోజుకో అప్డేట్ రివీల్ చేస్తూ పొన్నియన్ సెల్వన్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. ఇప్పటికే కార్తి, విక్రమ్, త్రిష్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్…తాజాగా బాలీవుడ్ అందాల రాశి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) పోస్టర్ విడుదల చేశారు.

తాజాగా విడుదలైన పోస్టర్ లో ఐశ్వర్యరాయ్ మరింత అందంగా కనిపిస్తోంది. ప్రతీకారం తీర్చుకునే రాణి నందిని పాత్రలో ఐశ్వర్య కనిపించనుంది. పట్టు చీర, పొడవాటి జుట్టు.. మెడలో ఆభరణాలతో చూపుతిప్పుకొనివ్వకుండా.. ప్రేక్షకులను మరింత మంత్రముగ్దులను చేస్తుంది ఐశ్యర్య లుక్. ప్రతీకారానికి అందమైన రూపం.. పజువూరు రాణి నందినిని కలవండి.. #PS1 సెప్టెంబర్ 30న తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలవుతోంది. .” అంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇక ఇప్పటికే విడుదలైన విక్రమ్, కార్తి పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, శోభితా ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తీబన్ పొన్నియిన్ సెల్వన్, మొదటి భాగం, PS-1 ప్రకాష్ రాజ్ సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..