యూట్యూబ్ ను షేక్ చేస్తున్న నటసింహం… రికార్డ్ వ్యూస్ దక్కించుకుంటున్న అఖండ టీజర్
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా అభిమానుల్లో అంచనాలు మాములుగా ఉండవు. అందులోను బోయపాటి తో అనే ప్రత్యేకించి చెప్పాలా... 'సింహా', 'లెజెండ్`వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ,
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు మాములుగా ఉండవు. అందులోనూ బోయపాటి తో అంటే ప్రత్యేకించి చెప్పాలా… ‘సింహా’, ‘లెజెండ్`వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు వారు చాలా ప్రత్యేకంగా భావించే తెలుగు సంవత్సరాది ఉగాదిన టైటిల్ ను అనౌన్స్ చేశారు. గత చిత్రాల్లాగానే బాలయ్య సినిమాకు `అఖండ` అనే పవర్ ఫుల్ టైటిల్ ఎనౌన్స్ చేసి ఆడియెన్స్ కు సరికొత్త సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. దీంతో పాటు మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ టీజర్‌లో ఇంతవరకూ చూడని సరికొత్త లుక్‌లో బాలయ్య కనిపించడంతో పాటు టైటిల్ కూడా ఆయనకు యాప్ట్ అయ్యేలా ఉండడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది… కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది…’ అంటూ హై వోల్టేజ్ తో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ విజిల్స్ వేయించేలా ఉంది. ముఖ్యంగా తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇప్పటికే ఈ టీజర్ యూట్యూబ్ లో 1.7 కోట్ల మంది వీక్షించారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలోద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం మే28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :