AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ముకాబ్‌లా’ రీమిక్స్.. అదే గ్రేస్.. మైండ్ బ్లోయింగ్ స్టెప్పులు

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమికుడు’ సినిమాను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. ప్రభుదేవా, నగ్మ నటించిన ఈ చిత్రం అప్పట్లో ప్రశంసలు అందుకొని.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించింది. ఇక అందులోని పాటలు ఇప్పటికీ ఏదో ఒక మోగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే’, ‘ముక్కాల ముక్కాబులా’, ‘ఊర్వశి ఊర్వశి’ పాటలు విరివిగా వింటూనే ఉంటాం. ఇక ‘ముక్కాల ముకాబ్‌లా’, ‘ఊర్వశి ఊర్వశి’ పాటలైతే బాలీవుడ్‌లోకి కూడా వెళ్లాయి. అంతేకాదు ‘ఊర్వశి’ పాటను […]

'ముకాబ్‌లా' రీమిక్స్.. అదే గ్రేస్.. మైండ్ బ్లోయింగ్ స్టెప్పులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 21, 2019 | 6:31 PM

Share

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమికుడు’ సినిమాను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. ప్రభుదేవా, నగ్మ నటించిన ఈ చిత్రం అప్పట్లో ప్రశంసలు అందుకొని.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించింది. ఇక అందులోని పాటలు ఇప్పటికీ ఏదో ఒక మోగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే’, ‘ముక్కాల ముక్కాబులా’, ‘ఊర్వశి ఊర్వశి’ పాటలు విరివిగా వింటూనే ఉంటాం. ఇక ‘ముక్కాల ముకాబ్‌లా’, ‘ఊర్వశి ఊర్వశి’ పాటలైతే బాలీవుడ్‌లోకి కూడా వెళ్లాయి. అంతేకాదు ‘ఊర్వశి’ పాటను ఆ మధ్యన రీమిక్స్ చేశారు. షాహిద్ కపూర్, కియారా అద్వాణీ ఆ పాటలో మెరిశారు. ఇక తాజాగా ‘ముక్కాలా ముకాబ్‌లా’ పాటను రీమిక్స్ చేశారు. ప్రభుదేవా, వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్‌లతో రెమో డిసౌజా ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3D’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ‘ముక్కాలా’ పాటను రీమేక్స్ చేశారు. ట్రైలర్‌లోనే ఈ విషయం అర్థమైనప్పటికీ.. తాజాగా ఆ పాట వీడియోను విడుదల చేశారు.

అందులో అదే గ్రేస్‌.. అంతకుమించిన స్టెప్పులతో అదరగొట్టేశాడు ప్రభుదేవా. దీంతో వయస్సు ఆయనకు మాత్రమే.. ఆయన డ్యాన్స్‌, గ్రేస్‌కు కాదంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ కూడా తమ డ్యాన్స్‌తో సూపర్ అనిపించారు. గణతంత్ర్యదినోత్సవం సందర్భంగా జనవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రెమో డెసౌజా దర్శకత్వంలో ఇదివరకు వచ్చిన డ్యాన్స్ చిత్రాలైన ‘ఏబీసీడీ’, ‘ఏబీసీడీ 2’ మంచి విజయం సాధించడంతో స్ట్రీట్ డ్యాన్సర్‌ 3Dపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత