AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూరీ-దేవరకొండ చిత్రం.. విలన్ అతడేనా..!

డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుండగా.. నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డాడు దర్శకుడు పూరీ. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో విలన్ పాత్ర కోసం యంగ్ హీరో […]

పూరీ-దేవరకొండ చిత్రం.. విలన్ అతడేనా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 21, 2019 | 8:16 PM

Share

డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుండగా.. నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డాడు దర్శకుడు పూరీ. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో విలన్ పాత్ర కోసం యంగ్ హీరో కార్తికేయను అనుకుంటున్నట్లు ఫిలింనగర్ టాక్.

ఆర్ఎక్స్100 చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన కార్తికేయ.. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించాడు. అయితే అవేవీ పెద్దగా హిట్ అవ్వలేదు. ఈ క్రమంలో నాని కోసం మధ్యలో విలన్‌గా కూడా మారాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో కార్తికేయ విలన్‌గా కనిపించాడు. అందులో అతడి నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. ప్రస్తుతం అజిత్ నటిస్తోన్న వలిమై చిత్రంలోనూ కార్తికేయను విలన్ పాత్ర కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ దేవరకొండ కోసం కూడా ఈ యంగ్‌ హీరోనే విలన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే కార్తికేయకు బంపరాఫర్ వచ్చినట్లే. మరి ఇందులో నిజమెంత..? అసలు పూరీ-దేవరకొండ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది..? ఎప్పుడు విడుదల అవుతుంది..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

బాబోయ్‌..గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం..! అసలు ఏంటో తెలిస్తే..
బాబోయ్‌..గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం..! అసలు ఏంటో తెలిస్తే..
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..