AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘జార్జి రెడ్డి’కి అరుదైన గౌరవం

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసిన జార్జ్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఇటీవల జార్జి రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటించాడు. గత నెల విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించగా.. బాక్సాఫీస్ వద్ద కూడా ఫర్వాలేదనిపించాడు జార్జిరెడ్డి. కాగా తాజాగా ఈ మూవీకి అరుదైన గౌరవం లభించింది. నాల్గవ లేక్ వ్యూ […]

'జార్జి రెడ్డి'కి అరుదైన గౌరవం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 21, 2019 | 5:04 PM

Share

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసిన జార్జ్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఇటీవల జార్జి రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటించాడు. గత నెల విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించగా.. బాక్సాఫీస్ వద్ద కూడా ఫర్వాలేదనిపించాడు జార్జిరెడ్డి. కాగా తాజాగా ఈ మూవీకి అరుదైన గౌరవం లభించింది. నాల్గవ లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు జార్జి రెడ్డి ఎంపికైంది. డిసెంబర్ 22, 23వ తేదీల్లో.. నోయిడా, ఢిల్లీలో ఈ మూవీని ప్రదర్శించబోతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఈ వేడుకకు చిత్రబృందం హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

అయితే కేరళలోని పాలక్కాడ్‌లోని జన్మించిన జార్జి రెడ్డి.. నిజాం కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి ఆపై ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో చేరాడు. చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగైన జార్జి రెడ్డి క్యాంపస్‌లోని సమస్యలపై పోరాడేవాడు. విద్యార్థి సంఘ నాయకుడిగా పలు ఉద్యమాలను తన ఆధ్వర్యంలో నడిపిన జార్జి రెడ్డి.. చిన్న వయస్సులో దారుణ హత్యకు గురయ్యాడు. 1972 ఫిబ్రవరిలో జార్జి రెడ్డిని ప్రత్యర్థులు చంపిన విషయం తెలిసిందే.

Follow Us
ఉమెన్స్‌ డే స్పెషల్‌.. 7 ప్రత్యేకమైన స్కీమ్స్‌!
ఉమెన్స్‌ డే స్పెషల్‌.. 7 ప్రత్యేకమైన స్కీమ్స్‌!
ఆదివారం మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..?
ఆదివారం మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..?
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది
పిల్లల ఇంటెలిజెన్స్‌ని గుర్తించడంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు
పిల్లల ఇంటెలిజెన్స్‌ని గుర్తించడంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు
జిమ్ వర్కవుట్లు వద్దు.. పైలేట్స్ ముద్దంటున్న జాన్వీ కపూర్
జిమ్ వర్కవుట్లు వద్దు.. పైలేట్స్ ముద్దంటున్న జాన్వీ కపూర్
EMIలపై ఐఫోన్‌ కొంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే..
EMIలపై ఐఫోన్‌ కొంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే..
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే
నోరులేని జీవుల ‘ఆత్మహత్య’ వెనుక ఉన్న కన్నీటి గాథలివే!
నోరులేని జీవుల ‘ఆత్మహత్య’ వెనుక ఉన్న కన్నీటి గాథలివే!
టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్
టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్
ఫ్లెక్సిటేరియన్.. జీర్ణ సమస్యలకు చెక్.. రోగనిరోధక శక్తికి బూస్ట్!
ఫ్లెక్సిటేరియన్.. జీర్ణ సమస్యలకు చెక్.. రోగనిరోధక శక్తికి బూస్ట్!