ప్రారంభమైన ‘మా’ ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పాలకవర్గం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఫిలిం ఛాంబర్‌లో ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో సీనియర్ నటులు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా.. మరో నటుడు నరేష్ శివాజీరాజాకు పోటీగా బరిలోకి దిగారు. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రి ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో 745 […]

  • Ram Naramaneni
  • Publish Date - 9:57 am, Sun, 10 March 19
ప్రారంభమైన ‘మా’ ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పాలకవర్గం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఫిలిం ఛాంబర్‌లో ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో సీనియర్ నటులు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా.. మరో నటుడు నరేష్ శివాజీరాజాకు పోటీగా బరిలోకి దిగారు. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రి ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో 745 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.