AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు.. భర్తతో విడాకులు తీసుకున్న హీరోయిన్.. పోస్ట్ వైరల్..

సోషల్ మీడియాలో సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు ఎంత తొందరగా వైరల్ అవుతాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తారల వెడ్డింగ్ పిక్చర్స్, పర్సనల్ విషయాలపై నెటిజన్స్ ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారు. అయితే గత రెండు మూడు రోజులుగా ఓ హీరోయిన్ విడాకుల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ రూమర్స్ ను నిజం చేస్తూ డివోర్స్ గురించి అధికారిక ప్రకటన చేసింది సదరు హీరోయిన్.

Tollywood : నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు.. భర్తతో విడాకులు తీసుకున్న హీరోయిన్.. పోస్ట్ వైరల్..
Mouni Roy News
Rajitha Chanti
|

Updated on: May 14, 2026 | 7:54 PM

Share

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ వ్యక్తిగత విషయాలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆమె ఇన్ స్టాలో మ్యారేజ్ ఫోటోస్ డిలీట్ చేయడంతో విడాకుల రూమర్స్ నెట్టింట హల్చల్ చేశాయి. అయితే రూమర్స్ నమ్మొద్దని.. అసత్యాలను ప్రచారం చేయొద్దంటూ ఇటీవల తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కానీ 24 గంటలు గడవకముందే భర్తతో విడాకులు తీసుకున్నట్లు అధికారిక ప్రకటన చేసి అందరికీ షాకిచ్చింది. ఆమె మరెవరో కాదండి బాలీవుడ్ హీరోయిన్, నాగిని ఫేమ్ మౌనీ రాయ్. తన నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది. ఆమెతోపాటు తన భర్త సూరజ్ నంబియార్ సైతం ప్రకటించారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి విడాకుల విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

“కొన్ని మీడియా వర్గాలు మా వ్యక్తిగత జీవితాల పట్ల అవసరంలేని, అతిగా జోక్యం చేసుకునే పద్దతిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలియజేస్తున్నాము. ప్రస్తుత పరిస్థితులను ప్రైవేట్‌గా, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి మాకు కొంత సమయం అవసరమని భావిస్తున్నాము. కొన్ని కల్పిత కథలు, పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా మా వ్యక్తిగత జీవితాలను సంచలనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రచారాలకు, మా మధ్య ఉన్న సంబంధం యదార్థానికి ఎటువంటి సంబంధం లేదు. మారుతున్న వ్యక్తిగత ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని, పరస్పర గౌరవం, అవగాహనతో విడివిడిగా ముందుకు సాగాలని మేమిద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాము. ప్రస్తుతానికి, మేము ఈ దశను ఎంతో ఆలోచనాత్మకంగా, ప్రైవేట్‌గా దాటడంపై దృష్టి పెట్టాము. భవిష్యత్తులో కూడా మా మధ్య ఉన్న స్నేహాన్ని మేము ఎల్లప్పుడూ గౌరవిస్తాము. ఈ సమయంలో మా గోప్యతను గౌరవిస్తూ, మాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.. మౌనీ & సూరజ్” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మౌనీ రాయ్, సూరజ్ పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

మౌని రాయ్, 2022 జనవరి 27న గోవాలో సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలలో హల్దీ, సంగీత్ కార్యక్రమాలతో పాటు, సాంప్రదాయ మలయాళీ, బెంగాలీ వివాహ పద్ధతులు కూడా జరిగాయి. వివాహానంతర పూల్ పార్టీతో ఈ వేడుకలు ముగిశాయి. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. అతడు దుబాయ్ లో నివసిస్తున్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

Follow Us