AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: నా ఇల్లును ఆక్రమించుకున్నారు.. మోహన్‌బాబు ఫిర్యాదుపై మనోజ్‌ స్పందన ఇదే..

మంచువారి కయ్యాలకు క్లైమాక్స్‌ ఇప్పట్లో కనిపించట్లేదు...! మొన్నటిదాకా కాస్త సైలెంట్‌గా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌ మళ్లీ ఫైట్‌ షురూ చేశారు. అయితే ఈసారి మంచు ఇష్యూ కలెక్టరేట్‌కు చేరింది. నా ఇల్లును ఆక్రమించుకున్నారు...! అక్రమంగా నివాసం ఉంటున్నారు...! నా ఇల్లు నాకు కావాల్సిందే అంటూ మంచు మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు.

Mohan Babu: నా ఇల్లును ఆక్రమించుకున్నారు.. మోహన్‌బాబు ఫిర్యాదుపై మనోజ్‌ స్పందన ఇదే..
Mohan Babu Manchu Manoj
Shaik Madar Saheb
|

Updated on: Jan 19, 2025 | 9:24 AM

Share

నా ఇల్లును ఆక్రమించుకున్నారు…! అక్రమంగా నివాసం ఉంటున్నారు…! నా ఇల్లు నాకు కావాల్సిందే అంటున్నారు మంచు మోహన్‌బాబు. జల్‌పల్లి ఇంటి విషయంలో అస్సల్‌ తగ్గేదేలే అంటున్న ఆయన… ఈసారి ఇష్యూని తీసుకెళ్లి రంగారెడ్డి కలెక్టరేట్‌లో పెట్టారు. తన ఇంట్లో అక్రమంగా ఉంటున్నవారిని వెంటనే ఖాళీ చేయించి… తనకు అప్పగించాల్సిందిగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులు తనకు చెందే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్నారు. జల్‌పల్లి నివాసంతో పాటు తన ఆస్తుల్లో ఉన్న అందరినీ వెంటనే వెకేట్ చేయించాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు మోహన్‌బాబు.

ఇక మోహన్‌బాబు ఫిర్యాదుపై స్పందించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. పోలీసుల దగ్గర్నుంచి మోహన్‌బాబు ఆస్తుల నివేదికను తెప్పించుకుని పరిశీలించారు. అందులోభాగంగానే ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న మంచు మనోజ్‌కి నోటీసులిచ్చారు. ఇక నోటీసులందుకున్న మనోజ్‌… వెంటనే కలెక్టర్‌ను కలిసి వివరణ ఇచ్చారు. అయితే… మనోజ్‌ మాత్రం తమకు ఎలాంటి ఆస్తి తగాదాలు లేవన్నారు. అన్యాయాన్ని నిలదీసినందుకే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మనోజ్..

ఎండ్- ఇక గత నెలలో ఇదే జల్‌పల్లి నివాసంలో మంచు ఫ్యామిలీలోని విభేదాలు బట్టబయలయ్యాయి. అయితే ఈమధ్యలో గొడవలు లేకపోవడంతో వివాదం ముగిసిందనే అనుకున్నారంతా. కానీ సంక్రాంతి వేడుకలతో మరోసారి వివాదం చెలరేగింది. యూనివర్సిటీకి ఇటు మోహన్‌బాబు… అటు మనోజ్‌ ఒకేసారి వెళ్లడం. ఆవెంటనే విష్ణు,మనోజ్‌ మధ్య ట్వీట్‌ ఫైట్‌ నడవడం… ఇక లేటెస్ట్‌గా తన ఇంటిని తనకు అప్పగించాలని మోహన్‌బాబు కలెక్టర్‌ను ఆశ్రయించడంతో మంచువారి కయ్యాలు మరోసారి తెరపైకొచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ కూరల్లో పొరపాటున కూడా టమాటా వేయకండి.. అసలు విషయం తెలిస్తే షాకే.
ఈ కూరల్లో పొరపాటున కూడా టమాటా వేయకండి.. అసలు విషయం తెలిస్తే షాకే.
దివ్యౌషధం వంటింట్లోనే ఉంటుంది కానీ.. ఎవ్వరూ పట్టించుకోరు..
దివ్యౌషధం వంటింట్లోనే ఉంటుంది కానీ.. ఎవ్వరూ పట్టించుకోరు..
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.!
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.!
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్..
వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్..
జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా
జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా
సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘లక్కీ భాస్కర్’!
సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘లక్కీ భాస్కర్’!
వెంకటేష్ పాత్రలో అక్షయ్.. మీనాక్షి ప్లేస్‌లో రాశీ ఖన్నా..
వెంకటేష్ పాత్రలో అక్షయ్.. మీనాక్షి ప్లేస్‌లో రాశీ ఖన్నా..
నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్ అయిపోయిన గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్ అయిపోయిన గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
ఆ ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్
ఆ ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్