ఘనంగా రోజా బర్త్‌డే వేడుకలు.. ఫొటోలను షేర్ చేసిన ఎమ్మెల్యే

తన అందం, అభినయంతో పలు భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకొని.. ఇప్పుడు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సినీ నటి, ఎమ్మెల్యే రోజా సోమవారం రోజా తన 48వ పుట్టినరోజును జరుపుకున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 11:08 am, Tue, 17 November 20
ఘనంగా రోజా బర్త్‌డే వేడుకలు.. ఫొటోలను షేర్ చేసిన ఎమ్మెల్యే

Roja Birthday Celebrations: తన అందం, అభినయంతో పలు భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకొని.. ఇప్పుడు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సినీ నటి, ఎమ్మెల్యే రోజా సోమవారం రోజా తన 48వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు, అభిమానుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక రోజా పుట్టినరోజు వేడుకలు ఆమె ఇంట్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రోజా భర్త సెల్వమణి, కుమారుడు, కుమార్తెతో పాటు పలువురు బంధువులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను రోజా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాగా.. అందులో రోజా అందరినీ ఆకట్టుకుంటున్నారు.

Read More:

క్యాన్సర్‌ బారిన పడి.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటుడు.. అభిమానులు షాక్‌

అపర భగీరథుడు వైఎస్ జగన్‌.. సీఎంపై నారాయణ మూర్తి ప్రశంసలు

https://www.facebook.com/RojaSelvamani.Ysrcp/posts/2053580151448667