Malayalam: నన్ను కూతురు అంటూనే నాతో బిడ్డను కంటానని అన్నాడు.. ఆ డైరెక్టర్ లైంగిక దాడి చేశాడు.. నటి సంచలన కామెంట్స్..

18 ఏళ్ల వయసులోనే అతడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని.. తనను ఓ శృంగార బానిసగా చూశాడని చెప్పుకొచ్చింది. కూతురిలా పిలుస్తూనే తనతో బిడ్డను కంటానని అన్నాడని.. అతడి పేరును పోలీసుల ఫిర్యాదులో బయటపెడతానని వెల్లడించింది. మలయాళంలో నీలకురక్కన్ అద్వైతం సినిమాతోపాటు మరికొన్ని చిత్రాల్లో నటించి పేరు సంపాదంచుకుంది నటి సౌమ్య. కానీ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు బయటపెట్టింది.

Malayalam: నన్ను కూతురు అంటూనే నాతో బిడ్డను కంటానని అన్నాడు.. ఆ డైరెక్టర్ లైంగిక దాడి చేశాడు.. నటి సంచలన కామెంట్స్..
Actress
Follow us

|

Updated on: Sep 06, 2024 | 9:26 AM

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక పెను తుఫాను సృష్టిస్తుంది. దీంతో ఒక్కొక్కరిగా పలువురు నటీమణులు తమ మనోవేదనను బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే తమిళ చిత్ర దర్శకుడిపై ఓ నటి షాకింగ్ ఆరోపణలు చేసింది. 18 ఏళ్ల వయసులోనే అతడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని.. తనను ఓ శృంగార బానిసగా చూశాడని చెప్పుకొచ్చింది. కూతురిలా పిలుస్తూనే తనతో బిడ్డను కంటానని అన్నాడని.. అతడి పేరును పోలీసుల ఫిర్యాదులో బయటపెడతానని వెల్లడించింది. మలయాళంలో నీలకురక్కన్ అద్వైతం సినిమాతోపాటు మరికొన్ని చిత్రాల్లో నటించి పేరు సంపాదంచుకుంది నటి సౌమ్య. కానీ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు బయటపెట్టింది. “కాలేజీలో మొదటి సంవత్సరం. 18 ఏళ్ల వయసులోనే తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అప్పుడు మా తల్లిదండ్రులకు సినిమా గురించి పెద్దగా తెలియదు. ఆ సినిమా దర్శకుడు మా తల్లిదండ్రులను ఒప్పించి సినీరంగంలోకి తీసుకెళ్లాడు” అంటూ చెప్పుకొచ్చింది.

“షూటింగ్ సమయంలో దర్శకుడు, ఆయన భార్య నాతో చాలా ఆప్యాయంగా ప్రవర్తించారు. తరచుగా నన్ను ఇంటికి తీసుకెళ్లారు. కానీ ఆ డైరెక్టర్ నాతో మాట్లాడిన ప్రతిసారి ఇబ్బందిగా అనిపించింది. నేను ప్రతిరోజు ఆడిషన్ కోసం ఆ డైరెక్టర్ ఇంటికి వెళ్లాను. ఓరోజు ఇంట్లో తన భార్య లేనప్పుడు నాకు ముద్దు పెట్టాడు. దీంతో ఒక్కసారిగా షాకయ్యాను. నేనేమైనా తప్పు చేశానా ? అనిపించింది. కానీ నన్ను తన కూతురిగా భావిస్తున్నానని చెబుతూనే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతంగా నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూతురు అంటూనే నాతో బిడ్డను కంటానని అన్నాడు. నాపై చాలాసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాదాపు ఏడాదిపాటు శృంగార బానిసగా చూశాడు. ఈ విషయాన్ని నా స్నేహితులకు కూడా చెప్పడానికి భయపడ్డాను. కూతురిగా భావించి బిడ్డను కనాలనుకున్న దర్శకుడు నా కెరీర్ ను పూర్తిగా నాశనం చేశాడు. సినిమా ముగిసే వరకు దర్శకుడు నన్ను శృంగార బొమ్మగా చూశాడు ” అంటూ చెప్పుకొచ్చింది.

భద్రతా కారణాల దృష్ట్యా దర్శకుడి పేరును బహిరంగంగా ప్రస్తావించలేనని.. మలయాళ సినిమాలపై లైంగిక ఆరోపణలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు కమిటీకి ఫిర్యాదు చేసినప్పుడు పూర్తి వివరాలను తెలియజేస్తానని సౌమ్య తెలిపింది. ఈ ఆరోపణ తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.