నటుడిగా గొప్ప సంతృప్తి కలిగింది: నాగచైతన్య

నటుడిగా గొప్ప సంతృప్తి కలిగింది: నాగచైతన్య

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానరుపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం మజిలీ. ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించి సెన్సిబుల్ సమ్మర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాగా.. సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్బంగా సమంత మాట్లాడుతూ.. సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే నమ్మలేకపోతున్నాను. సినిమా చూసి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 08, 2019 | 7:37 AM

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానరుపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం మజిలీ. ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించి సెన్సిబుల్ సమ్మర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాగా.. సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్బంగా సమంత మాట్లాడుతూ.. సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే నమ్మలేకపోతున్నాను. సినిమా చూసి నమ్మకంగా వున్నాం. కానీ ఇంత రెస్పాన్స్.. ఇంత హిట్ అవుతుందని అనుకోలేదు. ఒక మంచి రిజల్ట్ ఆర్టిస్టుకి ఎంత ముఖ్యమో నాకు తెలుసు. సినిమా చూసి నాగ్ మామ ఇంటికి వచ్చారు.. మమ్మల్ని అప్రిషియేట్ చేసారు. ఏమాయ చేసావే సినిమా తరువాత మోస్ట్ స్పెషల్ ఫిలిం మాకు ఇదే. అలాగే.. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.. తెలిపింది సమంత.

నాగచైతన్య మాట్లాడుతూ.. శివ కథ చెప్పగానే నేను ఎంత ఎగ్జైట్‌గా ఫీలయ్యానో ఇవాళ ప్రేక్షకులు కూడా అదే ఫీలవుతున్నారు. అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా రోజుల తర్వాత నటుడిగా శాటిస్ ఫ్యాక్షన్ కలిగింది. శివతో సినిమాలు చేస్తే గొప్ప నటుడిగా చూపిస్తాడు అనే నమ్మకం కలిగింది. రావు రమేష్, పోసాని గారు బాగా ఎంటర్టైన్ చేసారు. సాహు, హరీష్ ఫ్రెండ్స్‌లా కథని నమ్మి సినిమాకి ఏం కావాలో అది ఇచ్చారు. ఇంకా మరిన్ని సినిమాలు వారితో చెయ్యాలని కోరుకుంటున్నాను. థమన్, గోపిసుందర్, విష్ణు అందరికీ థాంక్స్. మజిలీ ఒక ఎమోషనల్ జెర్నీ.. అని అన్నారు నాగచైతన్య. ఈ కార్యక్రమంలో హీరో నాగచైతన్య, హీరోయిన్స్ సమంత, దివ్యాంశ, దర్శకుడు శివ నిర్వాణ, నటులు రావు రమేష్, పోసాని కృష్ణమురళి, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది పాల్గొన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu