తమిళ తంబీల కోసం ‘మజిలీ’
అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం కోలీవుడ్ లో రీమేక్ కానుంది. కోలీవుడ్ మీడియా ప్రకారం ఈ సినిమా రీమేక్ రైట్స్ ను తమిళ స్టార్ హీరో […]
అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం కోలీవుడ్ లో రీమేక్ కానుంది. కోలీవుడ్ మీడియా ప్రకారం ఈ సినిమా రీమేక్ రైట్స్ ను తమిళ స్టార్ హీరో ధనుష్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రీమేక్ ను ధనుష్ తన సొంత బ్యానర్ వండర్‌బార్ ఫిలిమ్స్ మీద నిర్మించనున్నట్లు సమాచారం. మరి ఈ రీమేక్ లో ధనుష్ హీరోగా నటిస్తాడో లేక వేరే హీరోతో రీమేక్ చేస్తాడో చూడాలి. ఇక ప్రస్తుతం ధనుష్.. అసురన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.