కేసీఆర్ బయోపిక్‌కు వర్మ రెడీ.. టైటిల్ ఇదే!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్ కు శ్రీకారం చుట్టాడు. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీస్తున్నట్లు అధికారకంగా ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను తన అధికారక ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. టైగర్ అనే టైటిల్ తో..ది అగ్రెసీవ్ గాంధీ అనే క్యాప్షన్ తో ఈ సినిమా తీయబోతున్నట్లు వర్మ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో […]

కేసీఆర్ బయోపిక్‌కు వర్మ రెడీ.. టైటిల్ ఇదే!
Follow us

|

Updated on: Apr 18, 2019 | 6:18 PM

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్ కు శ్రీకారం చుట్టాడు. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీస్తున్నట్లు అధికారకంగా ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను తన అధికారక ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. టైగర్ అనే టైటిల్ తో..ది అగ్రెసీవ్ గాంధీ అనే క్యాప్షన్ తో ఈ సినిమా తీయబోతున్నట్లు వర్మ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారో వేచి చూడాలి. అలాగే ఈ బయోపిక్ లో నటించే మిగిలిన తారాగణం ఎవరనేది త్వరలోనే ప్రకటించనున్నాడు ఆర్జీవీ. ఇక ఇటీవలే రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.