మెగా హీరోకు హీరోయిన్ దొరికింది..!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈ సినిమా ఇటీవలే లాంచ్ అయింది. గత కొద్ది రోజులగా హీరోయిన్ కోసం వెతుకుతున్న చిత్ర యూనిట్.. తాజాగా ఈ చిత్రానికి హీరోయిన్ ను ఖరారు చేశారని సమాచారం. మలయాళ బ్యూటీ దేవిక సంజయ్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ […]

మెగా హీరోకు హీరోయిన్ దొరికింది..!
Ravi Kiran

|

Apr 18, 2019 | 6:36 PM

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈ సినిమా ఇటీవలే లాంచ్ అయింది. గత కొద్ది రోజులగా హీరోయిన్ కోసం వెతుకుతున్న చిత్ర యూనిట్.. తాజాగా ఈ చిత్రానికి హీరోయిన్ ను ఖరారు చేశారని సమాచారం. మలయాళ బ్యూటీ దేవిక సంజయ్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనుంది.

రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. కాగా ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu