Mail Movie Review: ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్న ‘మెయిల్’.. కామెడి టైమింగ్‏తో అదరగొట్టిన ప్రియదర్శి..

ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మెయిల్’. దర్శకుడు ఉదయ్ గుర్రాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా

Mail Movie Review: ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్న 'మెయిల్'.. కామెడి టైమింగ్‏తో అదరగొట్టిన ప్రియదర్శి..
Follow us

|

Updated on: Jan 17, 2021 | 8:38 AM

టైటిల్: మెయిల్ తారాగణం : ప్రియదర్శి, హర్శిత్ మల్గిరెడ్డి, గౌరి ప్రియ డైరెక్టర్: గుర్రాల ఉదయ్ సంగీతం: స్వీకార్ అగస్తీ, కమ్రన్.

ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మెయిల్’. దర్శకుడు ఉదయ్ గుర్రాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఓటీటీ వేదికగా ఆహాలో జనవరి 12న విడుదల చేశారు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‏కు మంచి స్పందన వచ్చింది. 2005 లో అప్పుడప్పుడే పల్లెలకు కంప్యూటర్ పరిచయమవుతున్న రోజులు అంటూ మొదలయ్యే ఆ వీడియో ప్రేక్షకులకు ఆసక్తిరేపింది.

కథ.. ఈ సినిమాలో రవి కుమార్ (హర్షిత్ రెడ్డి) అప్పుడప్పుడే కంప్యూటర్లు గ్రామాల్లోకి వస్తున్న రోజులలో వాటిపై ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకుంటాడు. దీంతో అతడు కంప్యూటర్ కోర్స్ చేయాలని నిశ్చయించుకుంటాడు. ఇక రవికుమార్ గ్రామానికి దగ్గర్లో ఉండే కంబాలపల్లిలో కొత్తగా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభమవుతుంది. ఆ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రవికుమార్ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుంది అనేది సినిమాలో చూపించారు.

ఎవరు ఏలా చేసారంటే .. ఈ సినిమాలో రవికుమార్ చాలా మృదువైన స్వభావి గా చాలా సహజంగా నటించాడు. నిజాయితీగా ఉండే వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు.  అలాగే హీరోయిన్ గౌరీ ప్రియ, కీలక పాత్రలో నటించిన ప్రియదర్శి కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మూవీ అనలసిస్.. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో ఈ సినిమా మొదలవుతుంది. ఇక ప్రారంభం నుంచి ఆసక్తికరంగా ఉండగా.. కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులను వినోదాన్ని అందిస్తాయి. కంప్యూటర్ పై హీరోకి ఉన్న ఇష్టం.. అందుకు సంబంధించిన కోర్సు నేర్చుకోవడానికి పడే తాపత్రాయన్ని హీరో రవికుమార్ పాత్ర మనసుకు తాకుతుంది. ఆ ఉర్లో అదే సమయంలో కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ప్రారంభం కాగానే అక్కడ జాయిన్ అవుతాడు రవి. ఆ కోచింగ్ సెంటర్‏గా హైమత్ (ప్రియదర్శి) రవి కోసం ఒక జీ మెయిల్ క్రియేట్ చేస్తాడు. అయితే అకౌంట్‏కు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ రావడం వలన ఏం జరిగింది అనేది కథ. ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం కూడా అప్పట్లో ఇలానే ఉండేది కదా అని గుర్తుచేసుకునేలా ఉంటుంది. ప్రియదర్శి పాత్ర మొత్తం కామెడీ ఎంటర్ టైనర్‏గా ఉంటుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నటన సహజంగా అనిపిస్తుంది.

చివరిగా : 

గతం తాలూకు జ్ఞాపకాలను గుర్తుచేసిన ‘మెయిల్’