సాయి పల్లవి వద్దు: మహేశ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేసేందుకు అనిల్ రావిపూడి సన్నాహాలు చేస్తున్నాడు. మహర్షి షూటింగ్ పూర్తైన వెంటనే అనిల్ రావిపూడితో మహేశ్ సెట్స్ మీదకు వెళ్లనుండగా.. అందుకోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డాడు దర్శకుడు. ఈ క్రమంలో తన కథకు సాయి పల్లవి కరెక్ట్‌గా సరిపోతుందని భావించిన అనిల్, ఆమెతో సంప్రదింపులు జరిపేందుకు చెన్నై కూడా వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహేశ్ కోసం సాయిపల్లవి వద్దంటూ ఆయన అభిమానులు అనిల్‌కు మెసేజ్‌లు పెడుతున్నారు. ‘‘సాయి […]

సాయి పల్లవి వద్దు: మహేశ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 06, 2019 | 3:18 PM

సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేసేందుకు అనిల్ రావిపూడి సన్నాహాలు చేస్తున్నాడు. మహర్షి షూటింగ్ పూర్తైన వెంటనే అనిల్ రావిపూడితో మహేశ్ సెట్స్ మీదకు వెళ్లనుండగా.. అందుకోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డాడు దర్శకుడు. ఈ క్రమంలో తన కథకు సాయి పల్లవి కరెక్ట్‌గా సరిపోతుందని భావించిన అనిల్, ఆమెతో సంప్రదింపులు జరిపేందుకు చెన్నై కూడా వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహేశ్ కోసం సాయిపల్లవి వద్దంటూ ఆయన అభిమానులు అనిల్‌కు మెసేజ్‌లు పెడుతున్నారు.

‘‘సాయి పల్లవి మంచి నటి అయినప్పటికీ.. ఆమె అంత గ్లామర్‌గా ఉండదని అందుకే ఆమెను తీసుకోవద్దు’’ అంటూ కొందరు కామెంట్ పెడుతున్నారు. మరికొందరేమో ‘‘మాకు గ్లామరస్ హీరోయిన్ కావాలి. అలా అని మెహ్రీన్‌ మాత్రం తీసుకోవద్దండి. కనీసం రెండో హీరోయిన్ ఛాన్స్ కూడా ఇవ్వద్దండి’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా సాయి పల్లవి, రష్మికలను తీసుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.