AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Kaaram: ఓటీటీలో దూసుకుపోతున్న మహేశ్ బాబు గుంటూరు కారం, అసలు మ్యాటర్ ఇదేనట

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న గుంటూరు కారం సంక్రాంతి పండుగకు విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. థియేటర్స్ లో ఓటీటీలో ఈ మూవీకిి ఎక్కువగా రెస్పాన్స్ వస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన గుంటూరు కారం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Guntur Kaaram: ఓటీటీలో దూసుకుపోతున్న మహేశ్ బాబు గుంటూరు కారం, అసలు మ్యాటర్ ఇదేనట
Gunturu Kaaram
Balu Jajala
|

Updated on: Feb 16, 2024 | 6:10 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న గుంటూరు కారం సంక్రాంతి పండుగకు విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. థియేటర్స్ లో కంటే ఓటీటీలో ఎక్కవుగా ఈ మూవీకిి ఎక్కువగా రెస్పాన్స్ వస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన గుంటూరు కారం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో వ్యూస్ తో ఆకట్టుకుంటుంది.  ఈ సినిమా ఫిబ్రవరి 9న అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో హిట్ అయింది. గ్లోబల్ టాప్ 10 జాబితాలో గుంటూరు కారం 5.3 మిలియన్ గంటలు వీక్షించబడింది. 2 మిలియన్ల వ్యూస్ తో 6వ స్థానంలో ఉంది.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హిందీ వెర్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

గుంటూరు కారం హిందీ వెర్షన్ 2.8 మిలియన్ గంటలు వీక్షించబడి 1.1 మిలియన్ వీక్షణలతో 10వ స్థానంలో ఉంది. పాన్-ఇండియాయేతర చిత్రాలు కూడా హిందీ వెర్షన్‌లలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో మంచి వ్యూస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు చలనచిత్రాలు మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.  హాయ్ నాన్నా తాజా ఉదాహరణ. ఈ మూవీకి ఓటీటీలో మంచి రెస్పాన్ వచ్చింది. ఇప్పుడు గుంటూరు కారం కూడా అదే ఫాలో అవుతోంది. అయితే గ్లోబల్ మూవీ కోసం మహేష్ బాబు, SS రాజమౌళి జతకడుతున్న విషయం తెలిసిందే.  గుంటూరు కారం వైపు హిందీ ప్రేక్షకులను ఆకర్షించడానికి మరొక కారణం కావచ్చని భావిస్తున్నారు. హిందీ డబ్బింగ్ కూడా బాగుందని టాక్. డబ్బింగ్ కాకుండా స్ట్రెయిట్ హిందీ సినిమా చూసిన అనుభూతిని ఇస్తుందని బాలీవుడ్ ప్రేక్షకులు చెబుతున్నారు.

అయితే మహేశ్-రాజమౌళి మూవీకి మహారాజా అనే పేరు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇది అడ్వెంచర్ థ్రిల్లర్ కావటంతో రాజమౌళి అండ్ టీమ్ ఈ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది ధృవీకరించబడనప్పటికీ, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు కొత్త లుక్‌లో కనిపించనున్నారు. మార్చిలో చిత్రాన్ని ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా చిత్రీకరించనున్నారు. అయితే ఇటీవల మహేశ్ నటించిన సినిమాలు సర్కారువారిపాట, గుంటూరు కారం సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టినా భారీ స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో ఆయన రాజమౌళితో సినిమా చేస్తుండటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి