రక్షిత్ శెట్టి నటించిన ' సప్త సాగరాలు దాటి సైడ్ ఎ, 'సైడ్ బి' సినిమాలు రుక్మిణి వసంత్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ సినిమాల్లో రుక్మిణి వసంత్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఎమోషనల్ పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేశారు. ఇక్కడ కూడా రుక్మిణీ అందం, అభినయానికి చాలామంది ఫిదా అయ్యారు.