MaheshBabu: 50 ఏళ్ల వయసులో 25 లుక్స్.. మహేష్ ఫిట్‌నెస్ సీక్రెట్ లీక్ చేసిన కోచ్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, 50 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా ఎలా కనిపించగలుగుతున్నారు? నేటి యువతను వెంటాడుతున్న మిలియన్ డాలర్ ప్రశ్న ఇది. మహేష్ ఎక్కడ కనిపించినా లుక్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ‘వారణాసి’ మూవీ గ్లింప్స్ ..

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, 50 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా ఎలా కనిపించగలుగుతున్నారు? నేటి యువతను వెంటాడుతున్న మిలియన్ డాలర్ ప్రశ్న ఇది. మహేష్ ఎక్కడ కనిపించినా లుక్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ‘వారణాసి’ మూవీ గ్లింప్స్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో మహేష్ లుక్, స్మైల్, యూత్‌ఫుల్ గ్లో చూసి ఫ్యాన్స్ మరోసారి షాక్ అయ్యారు.
SS రాజమౌళి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్, ప్రియాంక చోప్రా జోనాస్ (మందాకిని), పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ)లతో పాటు మహేష్ రుద్ర రోల్‌లో కనిపించబోతున్నారు. అయితే మహేష్ లుక్‌కి అందరూ ఫిదా అయిపోయారు. ఇంతకీ మహేష్ లుక్ వెనక రహస్యం ఏంటి?
అసలు రహస్యం అదే..
మహేష్ లుక్ వెనకాల రహస్యాన్ని ఆయన ఫిట్‌నెస్ కోచ్ కుమార్ మన్నావా ఫిజిక్ ఎలైట్ మాస్టర్ ట్రైనర్ పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం మహేష్ 365 రోజులు వర్కౌట్ చేస్తారు, రోల్స్ కోసం కాదు, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం.
చాలామంది స్టార్స్ సినిమాల కోసం మాత్రమే హార్డ్ ట్రైనింగ్ చేస్తారు, కానీ మహేష్ ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా వర్కౌట్స్ చేస్తారని చెప్పుకొచ్చారు కుమార్. అంతేకాదు, మహేష్ స్మార్ట్ లుక్‌కి కారణం అతని హైట్ కూడా. 6’1″ హైట్, లాంగ్ లిమ్బ్స్ కారణంగా మసిల్ గెయిన్ చాలా చాలెంజింగ్ ఆర్మ్స్, లెగ్స్‌లో డెఫినిషన్ కోసం ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెడతారు.
వారంలో 5 రోజులపాటు 60-90 నిమిషాలు వర్కౌట్ చేస్తారట మహేష్. చెస్ట్, బ్యాక్, షోల్డర్స్, ఆర్మ్స్, లెగ్స్ అన్నింటికీ తగిన వ్యాయామం అందేలా కష్టపడతారట. వెయిట్ లిఫ్టింగ్, HIIT, యోగా, పిలాటెస్, ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ పెంచడానికి స్ట్రెచింగ్, యాక్షన్ సీన్స్‌కి సపోర్ట్ చేసేలా బాడీని రెడీగా ఉంచుతారు.. సిక్స్-ప్యాక్ ఏబ్స్ కాదు, ఓవరాల్ స్ట్రెంగ్త్, బ్యాలెన్స్ పై ఫోకస్ చేస్తారట. రెస్ట్ రోజుల్లో లైట్ యోగా లేదా వాకింగ్ చేస్తారట మహేష్.
రోజుకి 5-6 మీల్స్, టూ సప్లిమెంట్ షేక్స్, ప్రోటీన్, కార్బ్స్, హెల్తీ ఫ్యాట్స్ బ్యాలెన్స్‌గా ఉండేలా చూసుకుంటారట మహేష్. ఆయన ఏం టైమ్‌లో ఏం తినాలనేది ఆయన భార్య నమ్రత శిరోడ్కర్ మానిటర్ చేస్తారట. బ్రేక్పాస్ట్గా మూష్ (ఓట్స్ + ఎగ్స్ + నట్స్ + ఫ్రూట్స్), ఇడ్లీ, దోస, పూరీ, స్ప్రౌట్స్, పోస్ట్-వర్కౌట్ ప్రోటీన్ షేక్, లంచ్‌లోకి చికెన్/లాంబ్/ఫిష్ + బ్రౌన్ రైస్/క్వినోవా/ఖస్ ఖస్, డిన్నర్‌కి బ్రౌన్ బ్రెడ్ + ఎగ్స్/చికెన్ ఇలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుందట నమ్రత. అంతేకాదు, రోజుకు 3-4 లీటర్ల నీరు, గ్రీన్ టీ తీసుకుంటారట మహేష్. ఇది మెటబాలిజం బూస్ట్ చేసి, లీన్ మసిలర్ ఫ్రేమ్ మెయింటైన్ చేస్తుంది. ‘ఫిట్‌నెస్ లైఫ్‌లాంగ్ కమిట్‌మెంట్’ అనేది మహేష్ ఫిట్‌నెస్ మంత్ర.. మీరు కూడా మహేష్‌ని ఫాలో అయిపోయి యంగ్‌గా మెరిసిపోండి!
