AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్రివిక్రమ్‌తో మూడోసారి మహేష్‌.. కన్ఫర్మ్ చేసిన సూపర్‌స్టార్‌‌

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు మహేష్ బాబు. ఈ కాంబినేషన్‌లో ఇప్పటివరకు రెండు చిత్రాలు వచ్చాయి

త్రివిక్రమ్‌తో మూడోసారి మహేష్‌.. కన్ఫర్మ్ చేసిన సూపర్‌స్టార్‌‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 07, 2020 | 12:18 PM

Share

Mahesh Babu Trivikram: సూపర్‌స్టార్‌ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు మహేష్ బాబు. ఈ కాంబినేషన్‌లో ఇప్పటివరకు రెండు చిత్రాలు వచ్చాయి. అందులో అతడు హిట్‌ అవ్వగా.. ఖలేజా ఫ్లాప్‌గా నిలిచింది. కానీ ఆ తరువాత బుల్లితెరపై ఖలేజా పెద్ద విజయాన్ని సాధించింది. ఇక ఈ మూవీ థియేటర్లలో ఎందుకు ఫ్లాప్ అయ్యిందన్న ఇప్పటికీ చాలా మందికి అర్థం కాని విషయం. ఈ మాటను ఇప్పటికీ చాలా మంది సినీ ప్రేక్షకులు కూడా అంటుంటారు. ఖలేజా ఒక గొప్ప మూవీ అని, అప్పుడు ఆ సినిమాను చాలా మంది అర్థం చేసుకోలేకపోయారని కొంతమంది చెబుతుంటారు. ఇదిలా ఉంటే ఈ మూవీ వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన మహేష్‌ బాబు.. ఫ్యాన్స్‌కి మరో గుడ్‌న్యూస్‌ కూడా చెప్పారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో మూవీలో నటించబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు.

”ఖలేజా వచ్చి 10 సంవత్సరాలు అయ్యింది. నటుడిగా నన్ను నాకు కొత్తగా పరిచయం చేసిన సినిమా. ఇప్పటికీ ఇది ఓ స్పెషల్‌. నా మంచి స్నేహితుడు త్రివిక్రమ్‌కి థ్యాంక్స్‌. మా తదుపరి సినిమా కోసం ఎదురుచూస్తున్నా. త్వరలోనే ఉంటుంది” అని ట్వీట్ చేశారు. కాగా ఖలేజా మూవీ తరువాత త్రివిక్రమ్‌తో మహేష్‌కి విబేధాలు వచ్చినట్లు ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ తమ కాంబోలో హ్యాట్రిక్‌ సినిమా రాబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు మహేష్.

Read More:

ఖమ్మం ‘మైనర్’ కేసును సుమోటాగా స్వీకరించిన హెచ్‌ఆర్సీ

ల్యాండ్ సెటిల్‌మెంట్‌.. వ్యాపారిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడి గ్యాంగ్‌ వీరంగం

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల