AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana: Part 1: రామాయణపై దిల్ రాజు రివ్యూ.. అతను అద్భుతంగా నటించడట

రామాయణ కథ ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. తెలుగు, హిందీ, తమిళం.. ఇలా ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు ఈ ఇతిహాసం ఆధారంగా వచ్చాయి. ఇప్పుడు రామాయణం ఆధారంగా మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి తెరకెక్కించిన రామాయణ.

Ramayana: Part 1: రామాయణపై దిల్ రాజు రివ్యూ.. అతను అద్భుతంగా నటించడట
Dil Raju
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2026 | 9:12 PM

Share

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటించిన ఈ ఆధ్యాత్మిక దృశ్యకావ్యం ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రచార ఉధృతిని పెంచేశాయి. కాగా, ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విడుదల సమయం దగ్గరపడటంతో, ప్రత్యేక ప్రదర్శనలో ఈ చిత్రాన్ని వీక్షించిన దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా తన తొలి రివ్యూ పంచుకున్నారు. దిల్ రాజు తన పోస్ట్‌లో రాస్తూ.. “మన పవిత్ర రామాయణ ఇతిహాసాన్ని సినిమా రూపంలో తెలుగు ప్రేక్షకులకు అందించే భాగ్యం లభించడాన్ని ఒక గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను” అని తెలిపారు.

ప్రధాన పాత్రల్లో రణబీర్ కపూర్, సాయి పల్లవిల నటన అద్భుతంగా ఉందని, వారు శ్రీరామ-సీతల పాత్రలకు పూర్తి న్యాయం చేశారని కొనియాడారు. ఇక రావణాసురుడిగా నటించిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటన నన్ను పూర్తిగా అబ్బురపరిచింది అంటూ ఆయన నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా సాంకేతిక విలువల గురించి ప్రస్తావిస్తూ.. దర్శకుడు నితీష్ తివారి మార్క్ మేకింగ్, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా నిర్మాణ విలువలు విజువల్ వండర్‌లా ఉన్నాయని దిల్ రాజు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ కాంబినేషన్‌లో వచ్చిన సంగీతం, నేపథ్య సంగీతం మనసుకు హత్తుకునేలా ఉండి, ప్రేక్షకులకు ఒక మరుపురాని అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిరస్మరణీయ పురాణ కావ్యాన్ని ఇంతటి స్థాయిలో తెరకెక్కించినందుకు చిత్ర బృందానికి, నిర్మాత నమిత్ జీ, దర్శకుడు నితీష్ జీలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విడుదలకు ముందే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నుంచి ఇలాంటి పాజిటివ్ రివ్యూ రావడం, సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us