AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగార్జున ఆ స్టార్ హీరోతో కలిసి సినిమా చేయాల్సింది.. కానీ సెట్స్ పైకి వెళ్ళలేదు

అక్కినేని వెంకట్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినీ నిర్మాణ రంగం, అన్నపూర్ణ స్టూడియోస్ భవిష్యత్తుపై తన ఆలోచనలను పంచుకున్నారు. కాలంతో పాటు సినీ ప్రపంచం మారుతున్న తీరును విశ్లేషించిన ఆయన, తన వయసు రీత్యా ప్రస్తుతం నిర్మాణ బాధ్యతల నుండి తప్పుకున్నానని తెలిపారు. ఒక జనరేషన్ తర్వాత తప్పుటడుగులు వేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

నాగార్జున ఆ స్టార్ హీరోతో కలిసి సినిమా చేయాల్సింది.. కానీ సెట్స్ పైకి వెళ్ళలేదు
Nagarjuna
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2026 | 7:15 AM

Share

అక్కినేని వెంకట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ పరిశ్రమపై తన సుదీర్ఘ అనుభవాన్ని పంచుకున్నారు. ఒకప్పుడు చలనచిత్ర నిర్మాణంలో చురుకుగా ఉన్న తాను ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నానో వివరించారు. తన వయసు రీత్యా నిర్మాణంలో ఉండకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ప్రతి జనరేషన్‌కు ఔట్‌లుక్ మారుతూ ఉంటుందని, తప్పుటడుగులు వేసే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. టెక్నాలజీతో పాటు సినిమా హింస కూడా పెరిగిందని, అయితే మంచి కథాంశాలు ఇప్పటికీ ఉన్నాయని శివ లాంటి చిత్రాలను ఉదాహరణగా చెప్పారు. గతంలో తన సోదరుడు నాగార్జునతో కలిసి అమితాబ్ బచ్చన్‌ను కలిసిన ఒక ఆసక్తికర సంఘటనను వెంకట్ వెల్లడించారు. అమితాబ్ ఒక తెలుగు సినిమాలో కేమియో రోల్ చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో లయన్ కింగ్ తరహాలో ఒక ఫాదర్, సన్ కథాంశంతో కూడిన ఫోక్లోర్ సినిమాను అమితాబ్, నాగార్జునతో నిర్మించాలని తాను ప్రతిపాదించినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ కథలో కామెడీ, రొమాన్స్, అడ్వెంచర్, ఇంట్రీగ్ వంటి అన్ని రకాల అంశాలు కలగలిసి ఉంటాయని చెప్పారు. అయితే, అమితాబ్ ఇది చాలా ఖరీదైన ప్రాజెక్ట్ అవుతుంది వెంకట్ అని అన్నారని, అప్పట్లో అలాంటి సినిమా తీయడానికి అవసరమైన టెక్నాలజీ, గ్రాఫిక్స్ లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని వెంకట్ వివరించారు. బాహుబలి లాంటి భారీ చిత్రాలను తీయడానికి ఇప్పుడున్న టూల్స్, టెక్నాలజీ అప్పట్లో లేకపోవడం ఒక లోటుగా ఆయన భావించారు.

అన్నపూర్ణ స్టూడియోస్ భవిష్యత్తు విజన్ గురించి మాట్లాడుతూ.. కేవలం సర్వీసులు అందించడం కాకుండా, తమ వారసత్వాన్ని నిజంగా ముందుకు తీసుకెళ్లాలంటే మంచి సినిమాలు నిర్మించాలని తనకు, నాగార్జునకు గత మూడేళ్లుగా ఉందని తెలిపారు. ఇందుకోసం ఒక ప్రత్యేక నిర్మాణ విభాగాన్ని, బడ్జెట్‌ను ఏర్పాటు చేశామని, ప్రసాద్ అనే కంటెంట్ హెడ్‌ను నియమించి, ఐడియాలను జనరేట్ చేసి, ఇంక్యుబేట్ చేసేలా ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. మొదట కొన్ని సినిమాలు తీసి, భవిష్యత్తులో పదికి పెంచి, ప్యాన్ ఇండియా, గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో నాగార్జున, సుప్రియ వంటి బోర్డు సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని, ప్రాజెక్టులకు గ్రీన్ లైట్ ఇస్తారని తెలిపారు. అక్కినేని కుటుంబంలోని మగపిల్లలతో పాటు ఆడవాళ్లు కూడా ఈ ప్రక్రియలో భాగమవుతారని చెప్పారు. భవిష్యత్తుకు యువతరం వారే కీలకమని, కుర్రాళ్లు, అమ్మాయిలు ఉండాలని అభిప్రాయపడ్డారు.

తెలుగులో ఫిట్‌నెస్ సింబల్ ఎవరు అన్న ప్రశ్నకు, నాగార్జున పేరుతో పాటు ఈ రోజుల్లో అందరూ ఫిట్‌గానే ఉంటున్నారు, పోటీ ఎక్కువ అని వెంకట్ అన్నారు. తన వ్యక్తిగత ఆరోగ్యం గురించి మాట్లాడుతూ, తనకు వెన్నుపూస సమస్య ఉందని, డయాబెటిస్ కూడా ఉందని చెప్పారు. పదేళ్ల క్రితం పెద్ద సర్జరీ జరిగిందని, అందుకే డైట్‌తో ఆరోగ్యాన్ని మేనేజ్ చేసుకుంటానని తెలిపారు. ఒకప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండేవాడినని, ఆరోగ్య స్పృహ నాన్నగారి (ఏ.ఎన్.ఆర్.) నుంచే వచ్చిందని, ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఛాంబర్ పదవుల్లో ఎందుకు ఉండరని అడగగా, తాను పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబర్, ఫిలిం నగర్ క్లబ్‌లలో సభ్యుడిగా ఉండేవాడినని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us