AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. ఈ మండలాల్లో MPTC, ZPTC ఎన్నికలు వాయిదా.. పోలింగ్ ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2.61 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా, 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మురసు తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లాలోని నాలుగు మండలాల్లో పోలింగ్‌ను నవంబర్ 6కు వాయిదా వేశారు. మిగతా ప్రాంతాల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు వివరాలు తెలుసుకోండి.

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. ఈ మండలాల్లో MPTC, ZPTC ఎన్నికలు వాయిదా.. పోలింగ్ ఎప్పుడంటే..
Ap Mptc Zptc Elections
Shaik Madar Saheb
|

Updated on: Nov 05, 2026 | 6:56 AM

Share

MPTC, ZPTC ఎన్నికల సమరానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన యంత్రాంగం.. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహిస్తోంది.  7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌ కోసం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. మురసు తుఫాన్‌ ఎఫెక్ట్‌తో వాతావరణ పరిస్థితులు, ఇటు స్థానిక పరిణామాలతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని కలెక్టర్లు సైతం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే.. ఏలూరు జిల్లాలో తుఫాన్, భారీ వర్షాల కారణంగా వేలేరుపాడు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో జడ్పీటిసి, ఎంపీటీసీ ఎన్నికలు ఈనెల 6వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ ప్రాంతాల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. యథావిధిగా శనివారం ఓట్ల లెక్కింపు ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 కోట్ల 61 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.. అందుకోసం… 31వేల 460 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎన్నికల విధుల్లో దాదాపు 2లక్షల 52 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల బయటే కాకుండా.. ఓటు రహస్యానికి భంగం కలగకుండా అవసరమైన చోట్ల లోపల కూడా వీడియో రికార్డింగ్‌ చేయనున్నారు.

Follow Us