AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉన్మాది ఎలక్ట్రిక్ రంపం దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే..?

ఒక రంపం..ఓ ఉన్మాది కక్ష..ఒక బాలిక జీవితాన్ని తలకిందులు చేసింది. మొన్నటిదాకా స్కూల్లో స్నేహితులతో నవ్వుతూ గడిపిన ఆ పాప.. ఇప్పుడు ఆసుపత్రి బెడ్‌పై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఒకటా రెండా..శరీరం మొత్తం ఛిద్రమైపోయింది. విపరీతమైన రక్తస్రావం..వెంటిలేటర్‌పై చికిత్స.. గంటల తరబడి ఆపరేషన్లు. రాప్తాడులో జరిగిన దారుణం యావత్ రాష్ట్రాన్ని కదిలించింది. మరోవైపు బాధిత బాలికకు అండగా నిలిచారు మంత్ర నారాలోకేష్. బాలిక క్షేమసమాచారాలు తెలుసుకుంటూ, ప్రజలకు నిత్యం అప్‌డేట్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం రాప్తాడా బాలిక ఆరోగ్యం ఎలా ఉంది ?

ఉన్మాది ఎలక్ట్రిక్ రంపం దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే..?
Rapthadu Girl Health Update
Ram Naramaneni
|

Updated on: Nov 04, 2026 | 8:01 PM

Share

పట్టుమని 15ఏళ్లు కూడా లేని వయసు… తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ చదువుకునే పసి మనసు… ఇప్పుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టామిట్టాడుతోంది.. ముఖం, తల, మెడ, శరీర పైభాగం, వీపు…పొత్తికడుపు దగ్గర లోతైన గాయాలు ఉన్నాయి. కుడిచేయి దాదాపు తెగిపోయేంత తీవ్రంగా దెబ్బతింది. కాలికి చిన్న ముల్లు గుచ్చుకుంటేనే తట్టుకోలేం..అలాంటిది చెట్లను నరికే ఎలక్ట్రిక్ రంపంతో బాలిక శరీరాన్ని చిత్రవథ చేసాడా ఉన్మాది హేమంత్. ఎలా తట్టుకోగలదు ఆ బాధను.. ఎలా చెప్పుకోగలదు ఆ చిత్రవధను.. ఎలా భరించగలదు ఆ నరకాన్ని..

ఒళ్లంతా రక్తసిక్తమైన బాలికను అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో దాదాపు ఎనిమిది గంటల పాటు శ్రమించి ఆమె ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించారు. విపరీతమైన రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యంకోసం వెంటనే బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో మంత్రి నారా లోకేశ్ కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో మాట్లాడి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పాపకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి నారాలోకేష్ తెలిపారు.

ఇక బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో వైద్యుల పోరాటం మొదలైంది. చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో పలు విభాగాలకు చెందిన వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. ముఖానికి తీవ్ర గాయాలు.. తల, మెడ, వీపు భాగాల్లో లోతైన గాయాలు.. విపరీతమైన రక్తస్రావం.. రక్తపోటు పడిపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దాదాపు 11 గంటల పాటు సుదీర్ఘంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు కలిసి చికిత్స అందించారు. రక్తస్రావాన్ని అదుపులోకి తీసుకొచ్చి, రక్తపోటును నిలకడగా ఉంచేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. పలుమార్లు రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఆ తర్వాత వెంటిలేటర్ సపోర్ట్‌తో చిన్నారిని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు.ఒకవైపు ఆపరేషన్ థియేటర్‌లో వైద్యుల పోరాటం.. మరోవైపు ఆసుపత్రి బయట తల్లిదండ్రుల ఎదురుచూపులు.. ఆ చిన్నారి కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనలు.. ప్రస్తుతానికి బాలిక ఆరోగ్యం నిలకడగానే ఉంది..

ఇదే సమయంలో మంత్రి నారా లోకేశ్ కూడా బాలిక ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం ఆరా తీశారు. అక్టోబర్ 31న జరిగిన ఘటన తర్వాత మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో సంప్రదింపులు జరిపి, రక్తస్రావాన్ని అదుపులోకి తీసుకొచ్చారని.. బాలిక రక్తపోటు నిలకడగా ఉందని తొలి అప్‌డేట్ ఇచ్చారు. వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

నవంబర్ 1న స్వయంగా బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. పాప తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తన సొంతకూతురిలా చూసుకుంటామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని, వైద్య పరంగా ఎలాంటి లోటు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

అంతేకాదు విద్యాశాఖమంత్రిగా ఆ ఘటనను చూసిన మిగిలిన విద్యార్థుల పరిస్థితిపైనా లోకేశ్ దృష్టి పెట్టారు. ఆ రోజు తరగతి గదిలో ఉన్న 32 మంది విద్యార్థులతో పాటు 8, 9, 10 తరగతుల బాలికలకు మానసిక ధైర్యం కల్పించేందుకు 20 మంది కౌన్సెలర్ల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారితో, వారి తల్లిదండ్రులతో మాట్లాడేలా చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఆ దాడిని కళ్లారా చూసిన పిల్లలు మళ్లీ స్కూల్‌కు వెళ్లాలంటే భయపడవచ్చు. తరగతి గదిలో కూర్చోవాలంటే ఆ దృశ్యాలు గుర్తుకు రావచ్చు. అలాంటి భయాల నుంచి వారిని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. గాయపడిన ఇద్దరు బాలికలకే కాదు.. ఆ ఘటనతో మానసికంగా కుంగిపోయిన మిగిలిన పిల్లలకు కూడా అండగా ఉండాలని లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రభుత్వ స్కూళ్లలో ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కీలక నిర్మయం తీసుకున్నారు. ఇక నుంచి మొదటి పీరియడ్ పూర్తైన వెంటనే గేట్లు మూసివేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు ఆదేశాలిచ్చారు.

ఇలా ప్రతిరోజూ బాలిక ఆరోగ్యంపై అప్‌డేట్ ఇస్తూ, నిరంతరం ఫాలోఅప్ చేస్తూ బాధిత కుటుంబం అధైర్య పడకుండా మంత్రి నారాలోకేష్ భరోసా ఇచ్చారు. అయితే ఈ పోరాటం ఇంకా ముగియలేదు. ఒక చిన్నారి జీవితంలో ఇలాంటి విషాదం జరగకూడదు. కానీ జరిగింది. ఇంకా మరిన్ని చికిత్సలు, మరింత విశ్రాంతి అవసరం. ఆ బాలిక మళ్లీ తన కాళ్లపై నిలబడాలి.. తన చేతులతో పుస్తకాలు పట్టుకోవాలి.. తన క్లాస్‌రూమ్‌లోకి తిరిగి అడుగుపెట్టాలి. ఆమె జీవితంలో మళ్లీ ఆ నవ్వులు కనిపించాలి. ఆ రోజు కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది.

Follow Us
నిరంతరం బాలిక క్షేమసమాచారాలు ప్రజలకు చేరవేస్తున్న నారా లోకేశ్
నిరంతరం బాలిక క్షేమసమాచారాలు ప్రజలకు చేరవేస్తున్న నారా లోకేశ్
దీపావళి పొల్యూషన్.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి యమ డేంజర్!
దీపావళి పొల్యూషన్.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి యమ డేంజర్!
చోరీ నిందతో మనస్తాపం.. రైలు కింద పడి 17 ఏళ్ల బాలుడి ఆత్మహత్య
చోరీ నిందతో మనస్తాపం.. రైలు కింద పడి 17 ఏళ్ల బాలుడి ఆత్మహత్య
భూమి వైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌ .. భారత్‌లో శకలాలు!
భూమి వైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌ .. భారత్‌లో శకలాలు!
ఓటమి తర్వాత రివర్స్ కలెక్షన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
ఓటమి తర్వాత రివర్స్ కలెక్షన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
మూడు నెలల తర్వాత సడన్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ
మూడు నెలల తర్వాత సడన్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ
టికెట్‌ ఇవ్వని పార్టీలకు రెబల్స్ ఝలక్..
టికెట్‌ ఇవ్వని పార్టీలకు రెబల్స్ ఝలక్..
  ఈ ఒక్క కొమ్మ ఉంటే చాలు.. బాల్కనీ నిండా పచ్చని పుదీనా తోట
  ఈ ఒక్క కొమ్మ ఉంటే చాలు.. బాల్కనీ నిండా పచ్చని పుదీనా తోట
సబ్బుతో రుద్దినా పోని బకెట్ మరకలు.. ఈ పదార్థాలతో మొత్తం క్లీన్!
సబ్బుతో రుద్దినా పోని బకెట్ మరకలు.. ఈ పదార్థాలతో మొత్తం క్లీన్!
ప్రాణాలకు తెగించి సముద్రపు నాచు సేకరిస్తున్న మహిళలు..చీరకట్టులోనే
ప్రాణాలకు తెగించి సముద్రపు నాచు సేకరిస్తున్న మహిళలు..చీరకట్టులోనే