AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: పండుగ వేళ బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఒక్కసారిగా సీన్ రివర్స్.. నవంబర్ 5న తులం ఎంతంటే..?

బంగారం ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీపావళి పండుగ డిమాండ్ క్రమంలో ధరలు ఎగబాకుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. మొన్నటివరకు ధరలు పడిపోతూ వస్తోండటంతో.. అదే బాటలో నడుస్తాయని అందరూ ఊహించారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిందని చెప్పవచ్చు.

Gold Prices: పండుగ వేళ బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఒక్కసారిగా సీన్ రివర్స్.. నవంబర్ 5న తులం ఎంతంటే..?
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Nov 05, 2026 | 6:36 AM

Share

దీపావళి పండుగ వేళ బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాక్ తగిలింది. పసిడి ధరలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. సోమవారం నుంచి ధరలు ఊహించని రీతిలో పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ధంతేరస్, దీపావళి సందర్భంగా గోల్డ్ ఎక్కుమంది కొంటూ ఉంటారు. ఈ పండక్కి బంగారం కొంటే మంచి జరుగుతుందనే నమ్మకం చాలామందిలో బలంగా ఉంది. ఈ సమయంలో పండుగ డిమాండ్ కారణంగా ధరలు పుంజుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.  పండుగ ముగిసే వరకు డిమాండ్ కారణంగా ధరలు ఇదే స్థాయిలో ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 5వ తేదీన దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

బంగారం ధరలు ఇవే..

-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేట్లు రూ.1,42,810 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,30,910గా కొనసాగుతోంది

-హైదరాబాద్ బహిరంగ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,810గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,30,910 వద్ద కొనసాగుతోంది

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,810 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,910కు లభిస్తోంది

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,960 వద్ద పలుకుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,060గా ట్రేడవుతోంది

-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,810 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,30,910 వద్ద కొనసాగుతోంది

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,810 వద్ద కొనసాగుతోండగా. 22 క్యారెట్ల రేటు రూ.1,30,910 వద్ద ట్రేడవుతోంది

సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

-హైదరాబాద్‌లో కిలో సిల్వర్ ధర రూ.2,10,100 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2,10,000గా స్ధిరపడింది

-చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2,10,100 వద్ద ట్రేడవుతోంది

-బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,10,100గా కొనసాగుతోంది

– దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,10,100 వద్ద కొనసాగుతోంది

Follow Us