AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer 2 OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్ 2.. ఆ సీన్స్ కూడా యాడ్ చేసి రిలీజ్ చేయనున్న మేకర్స్

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్’. అప్పట్లో ఈ మూవీ థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

Jailer 2 OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్ 2.. ఆ సీన్స్ కూడా యాడ్ చేసి రిలీజ్ చేయనున్న మేకర్స్
Jailer 2
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2026 | 9:27 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ 2 సినిమా అక్టోబర్ 15, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. తాజాసమాచారం ప్రకారం జైలర్ 2 డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నవంబర్ 12, 2026 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. థియేటర్లలో చూపించని సుమారు 30 నిమిషాల అదనపు సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో జోడించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జైలర్ 2లో మలయాళ స్టార్ మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. అయితే ఆయనకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు థియేటర్ వెర్షన్‌లో తగ్గించినట్లు వార్తలు వచ్చాయి. ఓటీటీలో వాటిని తిరిగి చూపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే జైలర్ 2 సినిమాలో విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్ వంటి ప్రముఖ నటుల ప్రత్యేక పాత్రలు కూడా ఉన్నాయి. ఓటీటీ వెర్షన్‌లో వీరికి సంబంధించిన అదనపు సన్నివేశాలు ఉంటాయనే ప్రచారం అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది.

తమిళ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న నటుడు సంతానం కూడా ఈ సినిమాలో భాగమైనట్లు వార్తలు వచ్చాయి. థియేటర్ వెర్షన్‌లో కనిపించని ఆయన సన్నివేశాలు డిజిటల్ వెర్షన్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us