చెన్నైలో పోటెత్తిన “మహర్షి” హంగామా

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం నేడు భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. భ‌ర‌త్ అనే నేను బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత మహేష్ న‌టించిన చిత్రం మ‌హ‌ర్షి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. సినిమా టిక్కెట్స్ కోసం చెన్నైలో అభిమానులు రాత్రి నుండే థియేట‌ర్స్ ద‌గ్గ‌ర ప‌డిగాపులు కాస్తున్నారు. భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి త‌మ అభిమాన హీరోకి పాలాభిషేకం చేస్తున్నారు. డ‌ప్పుల మోత‌తో థియేట‌ర్ల వద్ద‌ పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది.  చెన్నైలోని కాశీ […]

చెన్నైలో పోటెత్తిన మహర్షి హంగామా
TV9 Telugu Digital Desk

| Edited By:

May 09, 2019 | 12:01 PM

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం నేడు భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. భ‌ర‌త్ అనే నేను బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత మహేష్ న‌టించిన చిత్రం మ‌హ‌ర్షి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. సినిమా టిక్కెట్స్ కోసం చెన్నైలో అభిమానులు రాత్రి నుండే థియేట‌ర్స్ ద‌గ్గ‌ర ప‌డిగాపులు కాస్తున్నారు. భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి త‌మ అభిమాన హీరోకి పాలాభిషేకం చేస్తున్నారు. డ‌ప్పుల మోత‌తో థియేట‌ర్ల వద్ద‌ పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది.  చెన్నైలోని కాశీ థియేట‌ర్ ద‌గ్గర అభిమానులు ట‌పాకులు పేలుస్తూ డ్యాన్స్‌లు చేస్తూ ఆ ప్రాంతాన్ని కోలాహాలంగా మార్చేశారు. త‌మిళ‌నాట కూడా మహేష్ బాబుకు భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి చిత్రానికి పాజిటివ్ టాక్ వ‌స్తుండ‌టంతొ, ప్రిన్స్ అభిమానులు తెగ సంతోష‌ప‌డిపోతున్నారు. ఫ‌స్టాఫ్‌లో మ‌హేష్ స్టూడెంట్‌గా, బిజినెస్‌మెన్‌గా అల‌రిస్తే సెకండాఫ్‌లో రైతుగా అద‌ర‌గొట్టాడ‌ట‌. మ‌హ‌ర్షి చిత్రం ఎమోషనల్‌గా సాగిన ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైనర్ అని ప్రేక్ష‌కులు చెబుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu