లాక్‌డౌన్ ఎఫెక్ట్: టీఆర్పీలో అదరగొట్టేసిన చెర్రీ ఫ్లాప్ మూవీ..!

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా.. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబసభ్యులకు సమయాన్ని వెచ్చిస్తూ టీవీలకు పరిమితమవుతున్నారు.

లాక్‌డౌన్ ఎఫెక్ట్: టీఆర్పీలో అదరగొట్టేసిన చెర్రీ ఫ్లాప్ మూవీ..!
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 12:55 PM

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా.. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబసభ్యులకు సమయాన్ని వెచ్చిస్తూ టీవీలకు పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లాప్ సినిమాలు కూడా మంచి టీఆర్పీని సాధిస్తున్నాయి. తాజాగా రామ్ చరణ్ ఫ్లాప్ చిత్రం బుల్లితెరపై అదరగొట్టేసింది. ఏకంగా టాప్‌లో నిలిచింది.

బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్‌ నటించిన వినయ విధేయ రామ గతేడాది ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. అందులో లాజిక్‌ లేని సన్నివేశాలు చాలానే ఉండగా.. అప్పట్లో వాటిపై తెగ విమర్శలు వచ్చాయి. ఇక ఈ చిత్రాన్ని ఇటీవల బుల్లితెరపై ప్రదర్శించగా.. మంచి టీఆర్పీ వచ్చింది. ఏకంగా 7.53తో టాప్‌లో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో చెర్రీ ధృవ(5.95), వరుణ్‌ తేజ్‌ గద్దలగొండ గణేష్‌(5,70), విజయ్‌ దేవరకొండ గీతా గోవిందం(5.24), సిద్ధార్ధ్‌ వదలడు(5.08) నిలిచాయి. అయితే మిగిలిన నాలుగు చిత్రాలు వెండితెరపై మంచి విజయాన్ని సాధించవి కాగా.. వాటన్నింటికంటే వినయ విధేయ రామ మంచి రేటింగ్‌ సాధించడం విశేషం. ఇక ఈ సినిమాలే కాదు.. మొదటిసారి ప్రీమియర్ అవుతోన్న సినిమాలు కూడా ఊహించిన దాని కంటే హయ్యెస్ట్ రేటింగ్‌ను సాధిస్తున్నాయి. ఈ క్రమంలో మొదటిసారి ప్రీమియర్ అయిన సరిలేరు నీకెవ్వరు 23.4 టీఆర్పీని సాధించి.. బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: చికిత్స కోసం.. 130కి.మీలు భార్యను భర్త ఎలా తీసుకువెళ్లాడంటే..!