రెహమాన్ బాధ.. సంగీత దర్శకులు ఇప్పటికైనా మారుతారా..!

సంగీత దిగ్గజం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్‌ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమ కష్టాన్ని ఖూనీ చేస్తున్నారంటూ పరోక్షంగా విమర్శలు చేశారు.

రెహమాన్ బాధ.. సంగీత దర్శకులు ఇప్పటికైనా మారుతారా..!
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 2:50 PM

సంగీత దిగ్గజం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్‌ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమ కష్టాన్ని ఖూనీ చేస్తున్నారంటూ పరోక్షంగా విమర్శలు చేశారు. అయితే ఆయన అసహనంలో ఓ అర్థం ఉంది. అందుకే నెటిజన్లు కూడా రెహమాన్‌కు తమ మద్దతును తెలుపుతున్నారు. ఇంతకు రెహమాన్‌ ఎందుకు ఫీల్ అయ్యారంటే..!

సిద్ధార్థ్‌ మల్హోత్రా, తారా సుటారియాలతో ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ‘మసక్కలి 2.0’ పేరుతో ఓ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రీమిక్స్‌కు తనిష్క్ బాగ్చీ సంగీతం అందించగా.. తులసి కుమార్‌, సచెట్‌ టాండన్ ఆలపించారు. ఇక ఈ పాట విడుదలైనప్పటి నుంచి మంచి వ్యూస్ వచ్చినప్పటికీ.. అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. రెహమాన్ పాటను ఖూనీ చేశారంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో రెహమాన్‌ కూడా తన పాటను ఖూనీ చేశారంటూ పరోక్షంగా కామెంట్లు చేశారు. ”ఒక పాటను రూపొందించడానికి నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తుంది. పలుమార్లు మార్చి మార్చి పాటను రూపొందించాల్సి ఉంటుంది. మసక్కలి పాట కోసం సుమారు 200 మంది సంగీతకారులు పనిచేశారు. ఒరిజనల్ పాటను మీరు ఒకసారి వినండి” అని కామెంట్ పెట్టారు. ఆయనే ఒరిజనల్ సాంగ్ లిరిసిస్ట్ కూడా మసక్కలి 2.0పై కామెంట్లు చేశారు.

అయితే రీమిక్స్‌లపై రెహమాన్ స్పందించడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ ఆయన రీమిక్స్‌ పాటలపై అసహనం వ్యక్తం చేశారు. రీమిక్స్‌ పాటలను వింటుంటే తనకు చాలా బాధగా ఉందని ఆస్కార్ అవార్డు గ్రహీత అన్నారు. తనకు నచ్చిన రీమిక్స్‌ ‘హమ్మ హమ్మ’ ఒక్కటే అని కూడా తెలిపారు. కాగా ఇది రెహమాన్‌ ఒక్కరి బాధే కాదు. అన్ని భాషల్లోనూ పలు పాటలు రీమిక్స్‌ చేస్తున్నారు. వాటిలో కొన్ని మాత్రమే బావుంటాయి. దీంతో వాటిని కంపోజ్‌ చేసిన ఒరిజనల్ సంగీత దర్శకులతో పాటు అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంచి పాటలను చెడగొడుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడైనా రీమిక్స్‌ విషయంలో మ్యూజిక్‌ డైరక్టర్లు తమ పంథాను మార్చుకుంటారేమో చూడాలి.

Read This Story Also: లాక్‌డౌన్ ఎఫెక్ట్: టీఆర్పీలో అదరగొట్టేసిన చెర్రీ ఫ్లాప్ మూవీ..!

Latest Articles
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే