విషాద వార్త‌…క‌రోనాతో సీనియ‌ర్ న‌టి మృతి

విషాద వార్త‌...క‌రోనాతో సీనియ‌ర్ న‌టి మృతి

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మ‌నుషుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతోంది. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ చిన్నా, పెద్దా అన్న తేడాలు లేకుండా.. ఇప్ప‌టికే ల‌క్ష‌కుపైగా ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. మెడిసిన్ కానీ, వ్యాక్సిన్ కానీ లేక‌పోవ‌డంతో..దీన్ని కంట్రోల్ చెయ్య‌డం క‌ష్ట‌త‌రంగా మారింది. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో ప‌లువురు సెల‌బ్రిటీస్ కూడా ఉన్నారు. ఇప్పుడు మరో సీనియ‌ర్ న‌టి కూడా కరోనాతో చనిపోయింది. హాలీవుడ్ లెజెండరీ నటి హిల్లరీ హీత్‌ కూడా కోవిడ్-19 తో […]

Ram Naramaneni

|

Apr 11, 2020 | 3:46 PM

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మ‌నుషుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతోంది. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ చిన్నా, పెద్దా అన్న తేడాలు లేకుండా.. ఇప్ప‌టికే ల‌క్ష‌కుపైగా ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. మెడిసిన్ కానీ, వ్యాక్సిన్ కానీ లేక‌పోవ‌డంతో..దీన్ని కంట్రోల్ చెయ్య‌డం క‌ష్ట‌త‌రంగా మారింది. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో ప‌లువురు సెల‌బ్రిటీస్ కూడా ఉన్నారు. ఇప్పుడు మరో సీనియ‌ర్ న‌టి కూడా కరోనాతో చనిపోయింది. హాలీవుడ్ లెజెండరీ నటి హిల్లరీ హీత్‌ కూడా కోవిడ్-19 తో ప్రాణాలు విడిచిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు. 74 సంవత్సరాల హీత్‌… కరోనా కారణంగా ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలతో త‌నువు చాలించింది.

ఈ విషయాన్ని నటి దత్త పుత్రుడు అలెక్స్ సామాజిక మాధ్యమాల ద్వారా క‌న్ఫామ్ చేశాడు. ‘విచ్‌ ఫైండర్‌ జనరల్‌’తో హిల్లరీ హీత్‌ నటిగా ఇంట్ర‌డ్యూస్ అయ్యారు. ‘ఆన్‌ ఆవ్‌ఫుల్లీ బిగ్‌ అడ్వెంచర్‌’, ‘హ్యూ గ్రాంట్‌’, ‘గ్యారీ ఓల్డమన్స్‌ నిల్‌ బై మౌత్‌’ వంటి మూవీస్ కు ఆమె నిర్మాతగా వ్వవహరించారు. ఈమె మరణంపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu