రష్మికపై ఆ నటుడికి సీక్రెట్ క్రష్‌.. గీత మేడమ్ ఏమందంటే..!

అభిమానులకే కాదు హీరో, హీరోయిన్లకు కూడా సీక్రెట్ క్రష్‌లు ఉంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాన్ని వారు బయట చెబుతుంటారు.

  • Tv9 Telugu
  • Publish Date - 11:00 am, Sat, 11 April 20
రష్మికపై ఆ నటుడికి సీక్రెట్ క్రష్‌.. గీత మేడమ్ ఏమందంటే..!

అభిమానులకే కాదు హీరో, హీరోయిన్లకు కూడా సీక్రెట్ క్రష్‌లు ఉంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాన్ని వారు బయట చెబుతుంటారు. తాజాగా రష్మిక అంటే తనకు క్రష్ అని వెల్లడించారు ఓ యంగ్ హీరో. ఇంతకు ఆయనెవరంటే.. హరీష్ కల్యాణ్. తమిళనాడుకు చెందిన ఈ హీరో.. తెలుగు చిత్రాలైన జై శ్రీరామ్, కాదలి, జెర్సీల్లో నటించారు. ప్రస్తుతం ఈ హీరో తమిళ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ హీరో ఇంటికి పరిమితం కాగా.. సోషల్ మీడియాలో అభిమానులతో చాటింగ్ చేశారు.

అక్కడ వారు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మీ సీక్రెట్ క్రష్ ఎవరంటూ స్వెత్లాన అనే నెటిజన్ ప్రశ్నించగా.. రష్మిక మందన అంటూ చెప్పేశారు. అంతేకాదు ఆ ట్వీట్‌కు రష్మికను కూడా ట్యాగ్ చేశారు. ఇక దీనికి స్పందించిన రష్మిక.. ”అయ్.. హాహా సూపర్ స్వీట్ ఆఫ్ యు” అని కామెంట్ పెట్టారు. కాగా ‘కిర్రిక్ పార్టీ’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌, కన్నడ సినిమాలతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ఇప్పుడు ‘పొగరు’, ‘సుల్తాన్’, ‘పుష్ప’ చిత్రాల్లో నటిస్తోంది.

Read This Story Also: కరోనాపై పోరుకు ‘మెగా’ మదర్ సాయం.. ఏం చేస్తున్నారంటే..!