నాచురల్ స్టార్‌తో ‘ఉప్పెన’ బ్యూటీ..!
మెగాస్టార్ మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Krithi Shetty Nani: మెగాస్టార్ మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ద్వారా హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అవ్వబోతున్నారు కృతి శెట్టి. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్, రెండు పాటలు రాగా.. వాటి ద్వారా కృతి శెట్టి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా ఆ వీడియోల్లో కృతి ఎక్స్‌ప్రెషన్స్ అందరినీ తెగ ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ విడుదల అవ్వకముందే ఈ కన్నడ బ్యూటీకి ఇప్పుడు బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో నాని నటించబోతున్న శ్యామ్ సింగరాయ్‌లో ఓ హీరోయిన్‌గా కృతిని సంప్రదించినట్లు సమాచారం. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉండనుండగా.. అందులో ఓ పాత్ర కాస్త నెగిటివ్‌గా ఉంటుందట. ఆ పాత్రకు సాయి పల్లవి ఖరారైనట్లు సమాచారం. ఇక మిగిలిన రెండు పాత్రల్లో ఓ కారెక్టర్ కోసం కృతిని, రాహుల్ సంప్రదించినట్లు టాక్. ఇప్పటికే కృతి స్టోరీని విన్నదని, తన నిర్ణయం త్వరలోనే చెబుతానని వెల్లడించిదని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే కృతికి మరో బంపరాఫర్ వచ్చినట్లే. కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న శ్యామ్ సింగరాయ్ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కనుంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.
Read More:
పవన్ కోసం వెళ్లిన వినోద్.. మధిని రంగంలోకి దింపుతున్న మహేష్..!
Tamannaah: తమన్నాకు కరోనా.. హైఫీవర్‌తో బాధపడుతున్న మిల్కీబ్యూటీ