Tamil Rockerz: పవన్ సినిమాకు ఏమైంది? ఉత్కంఠ రేకెత్తిస్తోన్న తమిళ్ రాకర్స్ ట్రైలర్.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్
Tamil Rockerz Trailer: తమిళ్ రాకర్స్.. నేటి తరానికి ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. డిజిటల్ పైరసీకి మారుపేరుగా ఉన్న ఈ సైట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారో, ఎక్కడుంటారో తెలియదు కానీ థియేటర్‌లో విడుదలైన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు క్షణాల్లోనే ఇందులో అప్‌లోడ్ చేస్తుంటారు..
Tamil Rockerz Trailer: తమిళ్ రాకర్స్.. నేటి తరానికి ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. డిజిటల్ పైరసీకి మారుపేరుగా ఉన్న ఈ సైట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారో, ఎక్కడుంటారో తెలియదు కానీ థియేటర్‌లో విడుదలైన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు క్షణాల్లోనే ఇందులో అప్‌లోడ్ చేస్తుంటారు. ఒక్క తమిళ్‌లోనే కాదు పలు భాషలకు చెందిన దర్శక నిర్మాతలు, హీరోలు ఈ వెబ్‌సైట్ వల్ల రూ. కోట్లల్లో నష్టపోయారు. ఇక పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ అత్తారింటికి దారేది, షాహిద్ కపూర్ ఉడ్తా పంజాబ్ ఇలా థియేటర్ రిలీజ్‌కు ముందే తమిళ్ రాకర్స్ సైట్‌లో దర్శనమిచ్చాయి. అసలు వీళ్లు ఎలా షూట్ చేస్తారు? ఆ తర్వాత ఎలా పైరసీ చేస్తారు? వీళ్ల నెట్‌వర్క్ ఏంటి? దీని వల్ల తమిళ్‌రాకర్స్‌కు వచ్చే లాభం ఏంటి? ఈ మొత్తం తమిళ రాకర్స్ నెట్‌వర్క్ వెనుక ఎవరున్నారు? అనే ఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రమే తమిళ్ రాకర్స్ (Tamil Rockerz). కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ ( Arun Vijay) కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ అర్విగన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మేనన్, పెరుమాళ్, వినోదిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సోనీలివ్ వేదికగా ఆగస్టు 19వ తేదీ నుంచి తమిళ్ రాకర్స్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. నేపథ్య సంగీతం అదిరిపోయింది. ‘పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాకు ఏమైంది, ప్రేమమ్, ఉడ్తా పంజాబ్ కు ఏమైంది? అన్న డైలాగులు బాగా పేలాయి. మరి తమిళ్ రాకర్స్ నెట్ వర్క్ ఏంటి? ఆ వెబ్ సైట్ హెడ్‌ను పట్టుకున్నారా? లేదా? తెలియాలంటే మాత్రం మా సినిమా చూడాల్సిందే అంటోంది చిత్రబృందం. అప్పటిలోపు ఈ ఇంట్రెస్టింగ్ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..