NTR Old House: చెన్నైలో ఎన్టీఆర్ నివాసాన్ని ఎప్పుడైనా చూశారా.? లోపలికి వెళ్లి మరీ ఫోటో దిగొచ్చు..!
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఒకప్పటి మద్రాస్ నేడు చెన్నైగా పిలుస్తున్న నగరంలోని కొలువు తీరింది. సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలందరూ ఒకప్పుడు చెన్నైలోనే నివాసం ఉండేవారు. దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సినీ పరిశ్రమను మద్రాస్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు నివసించిన ఇల్లు ప్రజల సందర్శనార్థం సిద్ధమవుతోంది. నటుడిగా నిలదొక్కుకున్న తర్వాత ఎన్టీఆర్ చెన్నైలో ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన నివాసం కొన్ని దశాబ్దాలుగా నిర్మానుష్యంగా మిగిలిపోయింది. చెన్నై నగరం నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ నివాసం గురించి ఈ జనరేషన్లో చాలామందికి తెలియదు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ నివాసం కొత్త హంగులు రూపుదిద్దుకొని త్వరలోనే ప్రజల సందర్శనార్థం సిద్ధం కాబోతోంది. ఇంతకీ ఒకప్పుడు అభిమానులతో నిత్యం రద్దీగా కనబడిన ఎన్టీఆర్ నివాసాన్ని సిద్ధం చేసి అభిమానుల సందర్శన కోసం సిద్ధం చేస్తున్నది ఎవరు? ఏంటి చూద్దాం..
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఒకప్పటి మద్రాస్ నేడు చెన్నైగా పిలుస్తున్న నగరంలోని కొలువు తీరింది. సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలందరూ ఒకప్పుడు చెన్నైలోనే నివాసం ఉండేవారు. దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సినీ పరిశ్రమను మద్రాస్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు దివంగత నందమూరి తారక రామారావు 1953లో చెన్నై నగరంలో టీ నగర్‌గా పిలుస్తున్న త్యాగరాయ నగర్ బజుల్లా రోడ్డులో ఆయన సతీమణి బసవతారకం పేరు మీద ఇంటిని కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ నివాసం ఉన్న ప్రాంతం నగరం నడిబొడ్డున ఉండడంతో అప్పట్లో మద్రాసు వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఆయన నివాసానికి వెళ్లి ఆయనను కలిసి వచ్చేవారు. ఎన్టీఆర్ నివాసానికి సమీపంలోని దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు నివాసం కూడా ఉండేది. పౌరాణిక పాత్రల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్‌ను అప్పట్లో అభిమానులు కనిపించే దైవంగా భావించి మద్రాస్ వెళ్ళి మరీ ఆయనను కళ్ళారా చూసి వచ్చేవారు.
ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చాక నివాసం అలాగే బోసిగా ఉండిపోయింది. ఎప్పటినుంచో ఎన్టీఆర్ నివాసాన్ని పునరుద్ధరించి అభిమానుల సందర్శన కోసం అందుబాటులోకి తీసుకురావాలని కోరుతుండేవారు. అయితే దశాబ్దాల తర్వాత అభిమానుల కోరిక నెరవేరబోతోంది. సీనియర్ ఎన్టీఆర్ నివసించిన భవనాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి కొత్త హంగులతో సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే పనులు పూర్తయి అభిమానుల సందర్శన కోసం అనుమతించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగిన అలాగే బంధువైన నిర్మాత చదలవాడ తిరుపతిరావు సోదరులు భవనాన్ని కొనుగోలు చేసి మరమ్మత్తులు జరిపిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ నివాసానికి పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. టీ నగర్ నుంచి వడపలని వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ పైనుంచి వెళ్లేటప్పుడు ఎన్టీఆర్ నివాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపై ఎన్టీఆర్ నివసించిన భవనాన్ని ప్రజలు అభిమానులు సందర్శించేందుకు వీలుగా అవకాశం కల్పించబోతున్నారు.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
