AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుమ్మురేపుతున్న ఏష నాగుల కట్ట మీద సాంగ్.. సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా యాక్షన్ ఎక్స్‌ట్రావ్యాగెంజా ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’, ఇటీవల విడుదలైన టీజర్‌తో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

దుమ్మురేపుతున్న ఏష నాగుల కట్ట మీద సాంగ్.. సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
Prabha Bangarigalla
Rajeev Rayala
|

Updated on: Sep 01, 2026 | 9:49 AM

Share

రీసెంట్ డేస్ లో ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి.. సినిమా సాంగ్స్ ను మించి జానపద గీతాలు క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి ఈ ఫోక్ సాంగ్స్. అంతే కాదు కొన్ని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాయి. విదేశాల్లోనూ మన పాటలకు జనాలు ఊగిపోతున్నారు. అయితే ఇలా పాపులర్ అయిన పాటలను ఇప్పుడు సినిమాల్లోనూ వాడేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఫోక్ సాంగ్స్ సినిమాల్లో వినిపించాయి. అయితే రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్యారడైజ్ లోనూ పాపులర్ తెలంగాణ ఫోక్ సాంగ్ ను వాడేశారు… అదే ఏష నాగుల కట్టమీద.

నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ

తెలంగాణ జానపదగీతాల్లో ఈ పాటకు ప్రత్యేకత ఉంది.. తెలంగాణ కల్చర్ తోపాటు , మంచి మాస్ బీట్ కూడా ఉంది ఈ సాంగ్ లో.. ఇక ఈ సాంగ్ పాడిన ఫీమేల్ సింగర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఎవరు.? ఇంతకు ముందు ఏ పాటలు పాడింది అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఆమె పేరు ప్రభ బంగారిగళ్ళ.

అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది

ఎక్కడా శిక్షణ తీసుకోకుండా తన తల్లి వద్దే ఆమె పాటలు నేచుకుందట ప్రభ. జానపద గాయనిగా సోషల్ మీడియాలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఆమె పాడిన పాటలు మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. నిమ్మతోట వనములో, ఓ పిలగ వెంకటేశు.. ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలుసు ఆ పాటలు పాడింది ప్రభనే.. ఇప్పుడిప్పుడే ఆమె సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. మొన్నామధ్య విశాల్ మకుటం అనే సినిమాలో ఓ పాట పాడింది. ఇప్పుడు ఏష నాగుల సాంగ్ తో దుమ్మురేపింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో 38 మిలియన్స్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఇలా వరుస సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు సింగర్  ప్రభ.

ఇవి కూడా చదవండి

ఆ సినిమాలో ఛాన్స్ అడిగితే ఆ హీరో వద్దు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన రాజశేఖర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us