AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక సందేశం.. పుతిన్‌కు సూటిగా చెప్పిన మాట ఇదే!

అంతర్జాతీయం: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కీలక సందేశం ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన భేటీలో.. “అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు పయనించాలి” అని స్పష్టం చేశారు. యుద్ధం కొనసాగే ప్రతి రోజు మానవాళిని వెనక్కి నెడుతోందని, శాంతి వైపు వేసే ప్రతి అడుగు ప్రపంచానికి కొత్త ఆశను కలిగిస్తుందని పేర్కొన్నారు.

ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక సందేశం.. పుతిన్‌కు సూటిగా చెప్పిన మాట ఇదే!
Pm Narendra Modi, Vladimir Putin
Balaraju Goud
|

Updated on: Sep 01, 2026 | 8:43 AM

Share

అంతర్జాతీయం: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కీలక సందేశం ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన భేటీలో.. “అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు పయనించాలి” అని స్పష్టం చేశారు. యుద్ధం కొనసాగే ప్రతి రోజు మానవాళిని వెనక్కి నెడుతోందని, శాంతి వైపు వేసే ప్రతి అడుగు ప్రపంచానికి కొత్త ఆశను కలిగిస్తుందని పేర్కొన్నారు.

కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా సోమవారం (ఆగస్టు 31) మోదీ-పుతిన్ ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అంశం సహా పలు అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తోందని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని మోదీ స్పష్టం చేశారు.

“యుద్ధం ముగింపే మానవాళి ఆకాంక్ష”

ఉక్రెయిన్ అంశంపై ఇంతకుముందు కూడా పుతిన్‌తో చర్చించామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. అన్ని సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. యుద్ధాన్ని కొనసాగించడం కంటే చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కారం కనుగొనడమే మార్గమని భారత వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు.

మోదీ తాజా వ్యాఖ్యలు 2022లో పుతిన్‌తో జరిగిన సమావేశంలో చేసిన “ఇది యుద్ధాల యుగం కాదు” అన్న వ్యాఖ్యను గుర్తుచేస్తున్నాయి. అప్పటి నుంచి రష్యా-ఉక్రెయిన్ వివాదంపై భారత్ సంభాషణ, దౌత్యం, శాంతియుత పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. 2024లో మాస్కో పర్యటన సందర్భంగా కూడా బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు విజయవంతం కావని మోదీ పేర్కొన్నారు.

గాంధీ, బుద్ధుని భూమి నుంచి శాంతి సందేశం

భారత్ గాంధీ, బుద్ధుని భూమి అని పేర్కొన్న ప్రధాని మోదీ.. శాంతి మార్గాన్నే భారత్ విశ్వసిస్తుందని చెప్పారు. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా మానవాళిపై పడుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా వివాదానికి శాంతియుత పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ అంశంతో పాటు భారత్-రష్యా మధ్య ఎనర్జీ, రక్షణ, స్పేస్, ఇన్నోవేషన్, ఎరువులు, ఆర్థిక రంగం, ప్రజల మధ్య సంబంధాలు వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. భారత్-రష్యా ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.

మరోవైపు, సెప్టెంబర్ 12-13 తేదీల్లో భారత్‌లో జరగనున్న 18వ BRICS సదస్సుకు పుతిన్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బిష్కెక్‌లో మోదీ-పుతిన్ భేటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పొటాషియం అధికంగా ఉంటే 5 రకాల ఆహారాలు ఇవే!
పొటాషియం అధికంగా ఉంటే 5 రకాల ఆహారాలు ఇవే!
ఆ హీరోను కానీ చూడగానే దండం పెట్టాలనిపిస్తుది.. తనికెళ్ల భరణి..
ఆ హీరోను కానీ చూడగానే దండం పెట్టాలనిపిస్తుది.. తనికెళ్ల భరణి..
తెలుగు మన వెలుగు.. తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ సభ జరగాల్సిందే..
తెలుగు మన వెలుగు.. తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ సభ జరగాల్సిందే..
ఇంటిగోడలపై మెలిచే ఈ మొక్కలను ఇలా సింపుల్‌గా తొలగించండి!
ఇంటిగోడలపై మెలిచే ఈ మొక్కలను ఇలా సింపుల్‌గా తొలగించండి!
అదృష్ట రాశులు ఇవే.. వీరి జీవితాల్లో గొప్ప మలుపు
అదృష్ట రాశులు ఇవే.. వీరి జీవితాల్లో గొప్ప మలుపు
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి: మీ శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదంటే
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి: మీ శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదంటే
2 ఫోర్లు, 5 సిక్స్‌లతో లేడీ సెహ్వాగ్ దూకుడు.. 24 బంతుల్లోనే హాఫ్
2 ఫోర్లు, 5 సిక్స్‌లతో లేడీ సెహ్వాగ్ దూకుడు.. 24 బంతుల్లోనే హాఫ్
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 7 రోజులలో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 7 రోజులలో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు
వాషింగ్ మెషిన్ కొనేస్తే సరిపోదు.. ఈ ఖర్చులు ఉంటాయని మీకు తెలుసా?
వాషింగ్ మెషిన్ కొనేస్తే సరిపోదు.. ఈ ఖర్చులు ఉంటాయని మీకు తెలుసా?
మహిళల టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
మహిళల టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..