AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF3: రాఖీభాయ్‌ మళ్లీ రావడం పక్కానా.? కేజీఎఫ్‌ 3పై చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ హింట్‌.

కన్నడ సినీ పరిశ్రమ రేంజ్‌ను జాతీయ స్థాయిలో చాటి చెప్పిన చిత్రం కేజీఎఫ్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఓ పెను సంచలనం. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని భాషల్లో రికార్డు కలెక్షన్లను రాబట్టిందీ మూవీ. తొలి పార్ట్‌తో పోల్చితే రెండో పార్ట్‌ మరింత...

KGF3: రాఖీభాయ్‌ మళ్లీ రావడం పక్కానా.? కేజీఎఫ్‌ 3పై చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ హింట్‌.
Narender Vaitla
|

Updated on: Apr 14, 2023 | 3:49 PM

Share

కన్నడ సినీ పరిశ్రమ రేంజ్‌ను జాతీయ స్థాయిలో చాటి చెప్పిన చిత్రం కేజీఎఫ్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఓ పెను సంచలనం. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని భాషల్లో రికార్డు కలెక్షన్లను రాబట్టిందీ మూవీ. తొలి పార్ట్‌తో పోల్చితే రెండో పార్ట్‌ మరింత విషయాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉంటే కేజీఎఫ్‌ 2 చిత్రం విడుదలై నేటితో (ఏప్రిల్‌ 14వ తేదీ) ఏడాది గడుస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్విట్టర్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్‌ చేసింది.

ఈ సందర్భంగా మేకర్స్‌ ఇచ్చిన ఓ చిన్న హింట్‌ ఇప్పుడు కేజీఎఫ్‌ చిత్రానికి మరో పార్ట్‌ రానుందన్న వార్తలకు బలాన్ని చేకూర్చాయి. కేజీఎఫ్‌ 2 విడుదలైన కొన్ని రోజులకే కేజీఎఫ్‌3 కూడా రానుందన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ కూడా ఈ వార్తలను ఖండించలేదు కదా.. అప్పుడప్పుడు చిన్న చిన్న హింట్స్‌ ఇస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చింది. ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేసిన వీడియోలో.. ‘రాకీ భాయ్‌ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నారు..?’ అనే ఆసక్తికరమైన పాయింట్‌ను హైలట్‌ చేశారు. దీంతో ఇదే సబ్జెక్ట్‌ను ఇతివృత్తంగా చేసుకొని సినిమా ఉండనున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే హీరో యశ్‌ మేకోవర్‌ కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న యశ్‌.. ఇప్పటికీ కేజీఎఫ్‌ లుక్‌లోనే కనిపించాడు. దీంతో కేజీఎఫ్‌ సిరీస్‌ నుంచి మరో చిత్రం రావడం కాన్ఫామ్‌ అని అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం సలార్‌ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నారు. మరి కేజీఎఫ్‌ ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?