‘కేజీఎఫ్ 2’కు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!

'బాహుబలి' తరువాత అదే క్రేజ్‌తో తెరకెక్కుతోన్న మరో పాన్ ఇండియా చిత్రం 'కేజీఎఫ్ 2'. కన్నడ స్టార్ నటుడు యశ్ హీరోగా నటిస్తోన్న చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

'కేజీఎఫ్ 2'కు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 13, 2020 | 9:53 PM

‘బాహుబలి’ తరువాత అదే క్రేజ్‌తో తెరకెక్కుతోన్న మరో పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ 2’. కన్నడ స్టార్ నటుడు యశ్ హీరోగా నటిస్తోన్న చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

కాగా కేజీఎఫ్ కొనసాగింపుగా వస్తోన్న ఈ మూవీలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి కనిపించనుంది. సంజయ్ దత్ విలన్‌గా కనిపిస్తుండగా.. రావు రమేష్, రవీనా టాండెన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బన్రూర్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీని ప్రశాంత్ కిర్గందర్ నిర్మిస్తున్నారు. భారీ క్రేజ్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అటు శాండిల్‌వుడ్‌తో పాటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్ మొదటి భాగం భారతదేశ వ్యాప్తంగా ఆకట్టుకోవడంతో.. రెండో భాగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.