Karate Kalyani: అయిననూ తగ్గేదేలే.. షోకాల్ నోటీసులపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కరాటే కల్యాణి..

శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు కరాటే కల్యాణి. ఈ అంశంలో తన పోరాటం ఆగదని కుండబద్దలుకొట్టారు. వాస్తవానికి ఎన్టీఆర్ పేరు ప్రస్తావించగానే.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలు గుర్తుకువస్తాయి. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఇలాంటి పరిస్థితిలో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా కరాటే కల్యాణి..

Karate Kalyani: అయిననూ తగ్గేదేలే.. షోకాల్ నోటీసులపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కరాటే కల్యాణి..
Karate Kalyani
Follow us

|

Updated on: May 17, 2023 | 7:30 PM

శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు కరాటే కల్యాణి. ఈ అంశంలో తన పోరాటం ఆగదని కుండబద్దలుకొట్టారు. వాస్తవానికి ఎన్టీఆర్ పేరు ప్రస్తావించగానే.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలు గుర్తుకువస్తాయి. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఇలాంటి పరిస్థితిలో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా కరాటే కల్యాణి.. ఎన్టీఆర్ విగ్రహాన్ని వ్యతిరేకించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే.. ‘మా’ అధ్యక్షుడు మంచు మనోజు ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం మరింత హీట్ పెంచింది.

ఈ క్రమంలోనే తనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై స్పందించిన కల్యాణి.. నోటీసులు వివరణ ఇచ్చుకుంటానని చెప్పారు. అయితే, పోరాటంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. తానూ ఎన్టీఆర్‌కు వీరాభిమానని చెప్పిన ఆమె.. ఆయన సొంతం రూపంపైనే అభిమానం చాటుకుందామని అన్నారు. ఆయన రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సంబరాలు చేద్దామని అన్నారు. ముఖ్యమంత్రిగా, నటుడిగా, తెలుగు కీర్తిని ప్రపంచ దేశాలక వ్యాపింపజేసిన మహా వ్యక్తిగా ఆయనను, ఆయన విగ్రహాన్ని ఆరాదిద్దామని చెప్పారు. అయితే, సినిమాల్లో శ్రీకృష్ణుడి పాత్రలు పోషించినంత మాత్రాన.. ఆయన విగ్రహాన్ని కృష్ణావతారంలో ఏర్పాటు చేయడం సరికాదన్నారు కల్యాణి.

ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో అనార్థాలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు కల్యాణి. రాజకీయ నేత అయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యర్థులు, వ్యతిరేకులు ఎవరైనా ధ్వంసం చేసినా, మరేదైనా దుశ్చర్యకు పాల్పడినా.. శ్రీకృష్ణుడికి అవమానం జరిగినట్లుగా ఉంటుందని, అందుకే తాము ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు కల్యాణి. అంతేకాదు.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి వేడుకలు నిర్వహించడం దేనికి సంకేతంగా నిలుస్తుందని ప్రశ్నించారామె. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే.. కృష్ణుడి రూపంలో విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు కల్యాణి. ఈ విషయంలో ఎవరేం చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. హరికీర్తనలు చదువుతూ పెరిగిన తాను.. నేడు కృష్ణుడు విషయంలో తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..