‘ఎంత మంచివాడవురా’గా కల్యాణ్ రామ్.. టైటిల్ లోగో రిలీజ్
ఈ ఏడాది ‘118’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కల్యాణ్ రామ్ ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేష్నకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఆ మధ్యన పూర్తి అయ్యాయి. ఇక ఇవాళ కల్యాణ్ రామ్ పుట్టినరోజు కావడంతో మూవీ టైటిల్‌తో పాటు, లోగోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం ఎంత మంచివాడవురా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. […]
ఈ ఏడాది ‘118’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కల్యాణ్ రామ్ ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేష్నకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఆ మధ్యన పూర్తి అయ్యాయి. ఇక ఇవాళ కల్యాణ్ రామ్ పుట్టినరోజు కావడంతో మూవీ టైటిల్‌తో పాటు, లోగోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం ఎంత మంచివాడవురా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దానికి సంబంధించిన లోగో వీడియో కూడా విడదలైంది.
ఇక ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ నటిస్తుంది. శివలెంక కృష్ణ ప్రసాద్, ఆదిత్య మ్యూజిక్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించనున్నాడు. 118 తరువాత విభిన్న కథలను ఎంచుకుంటోన్న కల్యాణ్ రామ్ ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇక ఈ మూవీతో పాటు మల్లిడి వేణు దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాడు కల్యాణ్ రామ్.