‘హ్యాపీ బర్త్ డే’ కళ్యాణ్ రామ్..!
నందమూరి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని.. విభిన్న కథలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు కల్యాణ్ రామ్. బాలగోపాలుడు చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లో అరంగేట్రం చేశాడు. తొలిచూపులోనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. పటాస్‌తో వసూళ్ల పటాసులు పేల్చిన కళ్యాణ్ రామ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. 1978 జూలై 5న హైదరాబాద్‌లో జన్మించాడు కల్యాణ్ రామ్. కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి.. అమెరికాలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్లో ఎమ్.ఎస్. చేశాడు. స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. […]
నందమూరి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని.. విభిన్న కథలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు కల్యాణ్ రామ్. బాలగోపాలుడు చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లో అరంగేట్రం చేశాడు. తొలిచూపులోనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. పటాస్‌తో వసూళ్ల పటాసులు పేల్చిన కళ్యాణ్ రామ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
1978 జూలై 5న హైదరాబాద్‌లో జన్మించాడు కల్యాణ్ రామ్. కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి.. అమెరికాలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్లో ఎమ్.ఎస్. చేశాడు. స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కల్యాణ్‌రామ్‌కు శౌర్య రామ్, తారక అద్వైత సంతానం. 2003లో ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై వచ్చిన ‘తొలిచూపులోనే’ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశాడు కల్యాణ్‌రామ్. అభిమన్యు, అసాధ్యుడు లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2005లో వచ్చిన అతనొక్కడే సినిమాతో రికార్డు సృష్టించాడు. లక్ష్మీ కల్యాణం, పటాస్, ఇజం, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, 118 లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు.
ఇక తాత నందమూరి తారక రామారావు పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ను ప్రారంభించాడు. నిర్మాతగా తొలి చిత్రం అతనొక్కడే. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అనంతరం వరుసగా తానే హీరోగా హరేరామ్, జయీభవ, కల్యాణ్‌రామ్ కత్తి, ఓమ్ 3డీ, పటాస్, ఇజం లాంటి సినిమాలు నిర్మించాడు. అంతేకాకుండా రవితేజ హీరోగా కిక్ 2, సోదరుడు జూనియర్ ఎన్టీఆర్‌తో జై లవకుశ చిత్రాలను కూడా నిర్మించాడు. ఇందులో జై లవకుశ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన రావన్ మహరాజ్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే పేరుతో కల్యాణ్ రామ్ సినిమా చేయనున్నాడు. మల్లిడి వేణు దర్శకుడిగా కల్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్‌ను పరిశీలించినా ఫైనల్‌గా రావణ అయితే బాగుటుందని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ టైటిల్‌తో మోహన్‌బాబు ప్రధాన పాత్రలో 100 కోట్లతో పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేశారు. 118 హిట్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన కల్యాణ్ రామ్ ఆ జోష్‌ను కంటిన్యూ చేసేందుకు కష్టపడుతున్నాడు. మరి రావణ మరో హిట్ ఇస్తాడేమో చూడాలి.