కళ్లకు గంతలు కట్టుకుని.. ట్రాఫిక్‌లో మోటర్ సైకిల్ పై రైడ్
నెల్లూరులో ప్రముఖ మెజీషియన్ జూనియర్ జాదూగర్ ఆనంద్ కళ్లకు గంతలు కట్టుకొని మోటర్ సైకిల్ రైడ్ షో నిర్వహించారు. ట్రాఫిక్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్నగర ట్రాఫిక్ డిఎస్పి మల్లికార్జున రావు హాజరయ్యారు. కళ్ళకు గంతలు కట్టుకున్న జూనియర్ జాదూగర్ ఆనంద్ రద్దీగా ఉండే రహదారిపై మోటార్ సైకిల్ నడిపి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నగరంలోని పురమందిరం నుంచి వి.ఆర్.సి., ఆర్.టి.సి., వేదయపాలెం, పొదలకూరు రోడ్డు, గాంధీ బొమ్మ […]
నెల్లూరులో ప్రముఖ మెజీషియన్ జూనియర్ జాదూగర్ ఆనంద్ కళ్లకు గంతలు కట్టుకొని మోటర్ సైకిల్ రైడ్ షో నిర్వహించారు. ట్రాఫిక్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్నగర ట్రాఫిక్ డిఎస్పి మల్లికార్జున రావు హాజరయ్యారు. కళ్ళకు గంతలు కట్టుకున్న జూనియర్ జాదూగర్ ఆనంద్ రద్దీగా ఉండే రహదారిపై మోటార్ సైకిల్ నడిపి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నగరంలోని పురమందిరం నుంచి వి.ఆర్.సి., ఆర్.టి.సి., వేదయపాలెం, పొదలకూరు రోడ్డు, గాంధీ బొమ్మ మీదుగా తిరిగి టౌన్ హాల్ వరకు ఈ ప్రదర్శన సాగింది. కళ్ళకు గంతలు కట్టుకుని వాహనాలు జాగ్రత్తగా నడిపితే, అన్ని చూడగలిగిన వారు ఇంకా అప్రమత్తంగా నడపాలని జాదూగర్ ఆనంద్ పిలుపు నిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలను నివారించాలనే తాము ఈ ప్రదర్శన నిర్వహించినట్లు వెల్లడించారు.