ఇక అన్నిటికీ ఆధారే ఆధారం.. సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

గురువారం పలు కీలక బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇందులో ఆధార్ చట్టం కూడా ఒకటి. ప్రతిపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. ఆధార్ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఇకపై దీనిని గుర్తింపు కార్డుగా వినియోగించుకునే అవకాశం లభించింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాల కోసం, మొబైల్ కనెక్షన్ల కోసం ఆధార్‌ను ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వోచ్చు. 2016నాటి ఆధార్‌ చట్టానికి ప్రభుత్వం ఈ సవరణ చేసింది. దీనిపై జరిగిన చర్చలో […]

ఇక అన్నిటికీ ఆధారే ఆధారం.. సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2019 | 7:53 AM

గురువారం పలు కీలక బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇందులో ఆధార్ చట్టం కూడా ఒకటి. ప్రతిపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. ఆధార్ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఇకపై దీనిని గుర్తింపు కార్డుగా వినియోగించుకునే అవకాశం లభించింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాల కోసం, మొబైల్ కనెక్షన్ల కోసం ఆధార్‌ను ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వోచ్చు. 2016నాటి ఆధార్‌ చట్టానికి ప్రభుత్వం ఈ సవరణ చేసింది. దీనిపై జరిగిన చర్చలో లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయగా, ప్రస్తుత సర్కారు బిల్లు ప్రవేశపెట్టిందని అన్నారు.

ఇక దీనిపై కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రజల వ్యక్తిగత గోప్యత, భద్రత కోసం ఈ సవరణలు తెచ్చామని చెప్పారు. ఆధార్ లేని కారణంగా ఎవ్వరికీ సంక్షేమ ఫలాలు నిరాకరించమని తెలిపారు. ప్రైవేటు సంస్థలు ఏవైనా ప్రజల ఆధార్‌ డేటాను నిల్వచేస్తే రూ.1కోటి జరిమానాతో పాటు జైలుశిక్ష పడుతుందని చెప్పారు. ఆధార్‌ వివరాలను దేశభద్రతకు ముప్పు తలెత్తినప్పుడు, కోర్టులు ఆదేశించినప్పుడే పంచుకోవడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆధార్‌ కార్డుల్లోని పౌరుల వ్యక్తిగత సమాచారం భారత్‌లో సురక్షితంగా, భద్రంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం 123 కోట్ల మంది ఆధార్‌ను వాడుతున్నారనీ, దీని కారణంగా ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లు ఆదా చేయగలిగిందని వెల్లడించారు. ఆధార్‌ సాయంతో 4.23 కోట్ల నకిలీ ఎల్పీజీ కనెక్షన్లు, 2.98 కోట్ల బోగస్‌ రేషన్‌ కార్డులను తొలగించామన్నారు. త్వరలోనే డేటా సంరక్షణ చట్టాన్ని తెస్తామన్నారు. కాగా ఈ బిల్లును ఎన్సీపీ, సీపీఎం, ఏఐఎంఐఎం, ఐయూఎంఎల్‌ పార్టీలు వ్యతిరేకించాయి.