సీఎం జగన్ నాకు స్పూర్తి: నవనీత్ కౌర్

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మహారాష్ట్ర ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ స్పూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ అనేక కష్టాలను ఎదుర్కొని ఏపీకి సీఎం అయిన జగన్ తనకు ఆదర్శమన్నారు. కాగా ఇండిపెండెంట్‌గా యాభైవేల మెజారిటీతో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన నవనీత్ కౌర్.. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తొలిసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ తన వాయిస్ గట్టిగా వినిపించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న […]

సీఎం జగన్ నాకు స్పూర్తి: నవనీత్ కౌర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 05, 2019 | 7:43 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మహారాష్ట్ర ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ స్పూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ అనేక కష్టాలను ఎదుర్కొని ఏపీకి సీఎం అయిన జగన్ తనకు ఆదర్శమన్నారు. కాగా ఇండిపెండెంట్‌గా యాభైవేల మెజారిటీతో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన నవనీత్ కౌర్.. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తొలిసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ తన వాయిస్ గట్టిగా వినిపించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం గురించి నాలుగు ప్రశ్నలను పార్లమెంట్‌లో లేవనెత్తి.. అందరి దృష్టిని ఆకర్షించారు. తాను ఇప్పుడు ఎంపీ అయినప్పటికీ నవనీత్ కౌర్ అనే పేరు ప్రపంచానికి తెలిసేలా చేసింది తెలుగు ప్రజలే అని చెప్పారు. హీరోయిన్‌గా తనను ఆదరించిన తెలుగువారితో ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

తాను రాజకీయాల్లోకి వెళ్లడం.. దేశం తరుపున లోక్ సభలో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానని ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో చెప్పారు. తాను తెలుగు సినిమాల్లో పనిచేసి ఉండటం వల్ల.. ఎంపీగా గెలిచిన తరువాత లోక్ సభలో అడుగుపెట్టి తెలుగు వాళ్లు ఎవరున్నారు? ఆంధ్ర వాళ్లు ఎవరు ఉన్నారు అని చూసుకున్నా. ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటన్న దానిపై అవగాహన ఉంది. తనకు మహారాష్ట్ర అంటే ఇష్టమే కాని.. ఆంధ్ర అంటే ప్రాణం అని చెప్పారు. ఎందుకంటే తన కెరియర్‌ని హీరోయిన్‌గా ఆంధ్ర నుంచే ప్రారంభించానన్నారు. అప్పుడు ఆంధ్రనే. ఇప్పుడు రెండు ప్రాంతాలుగా విడిపోయింది కాని.. నవనీత్ కౌర్ ఎవరన్నదాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది ఆంధ్రనే. తన పేరు ఎవరికీ తెలియని సందర్భంలో ఆంధ్ర జనం.. తనకు పేరుతో పాటు ఫేమ్ ఇచ్చారని అంతకు మించి మంచి స్టేటస్ ఇచ్చారని నవనీత్ కౌర్ అన్నారు.

నవనీత్ కౌర్ ఆర్మీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడే సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. మహారాష్ట్రలో యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న రవి రాణాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త రవిరాణా ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.