Vijay- Trisha: త్రిష చుట్టూనే తమిళనాడు రాజకీయాలు.. టీవీకే అధినేత విజయ్ అలా ప్లాన్ చేశారా?
ఔను మనం వింటున్నది నిజమేనా.?ఆమె కోసం ఆయన అంత రిస్క్ చేస్తున్నాడా ? ఆల్రెడీ ఫ్యామిలీ దూరమైంది. ఇప్పుడు రాజకీయం కూడా ఆమెకోసమే చేస్తున్నాడు ? మే 4న ఆమె భర్త్‌డేకు పుష్పరేంజ్‌లో గిఫ్ట్ ప్లాన్ చేశాడా ? అందుకే సింగం సింగిల్ అంటూ పొత్తు గిత్తు జాన్తానై అంటూ పెద్ద పార్టీలను సైతం పక్కనపెడుతున్నాడా ? పాత్రధారి ఆయనే అయినా తెరవెనుక ఉండి కథ స్క్రీన్‌ప్లే డైరెక్షన్ అంతా ఆమె నడిపిస్తోందా..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడేకొద్దీ.. యమరంజుగా మారుతోంది రాజకీయం . ముఖ్యంగా సోషల్ మీడియా అయితే ద్వందార్దాలు..పెడార్దాలు.. నానార్ధాలు.. సందులు సవర్ణదీర్గ సందులతో లింక్ అయితే చాలు సింక్ చేసేపనిని చాలా సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా కొత్తగా పుట్టుకొచ్చిన హీరో విజయ్ పార్టీ టీవీకేపై ఈమధ్యకాలంలో వస్తున్న విమర్శలు, ఆరోపణలు వింటుంటే అవునా నిజమా..అంటూ మనల్ని మనమే గిల్లుకునేంతలా ట్రోల్ అవుతున్నాయి.. మామూలుగా టీవీకే పార్టీ ఫుల్ ఫామ్ ఏంటి? తమిళగ వెట్రి కళగమ్…..కానీ సోషల్ మీడియా ఈపార్టీకి కొత్త పేరు పెట్టిందండోయ్..ఏంటో తెలుసా? త్రిష విజయ్ కృష్ణన్. ఇందులో హీరోయిన్ త్రిషపేరు లాగి మరీ టీవీకే పార్టీకి కొత్త అర్థం చెబుతోంది సోషల్ మీడియా. ఇది ప్రత్యర్ధుల సృష్టేనని ఎంత సర్దిచెప్పుకున్నా, జనంలోకి త్రిష విజయ్ కృష్ణన్ అన్న పేరు మాత్రం చొచ్చుకుపోయింది..ముఖ్యంగా X, Instagram, YouTube లాంటి ప్లాట్‌ఫార్మ్‌లలో “టీవీకే అంటే త్రిష విజయ్ కృష్ణన్” అంటూ మీమ్స్, పోస్టులు వైరల్ అవుతున్నాయి.
మే 4 త్రిష బర్త్‌డే.. త్రిషకు విజయ్ పుష్ప రేంజ్ గిఫ్ట్
పుష్ప మూవీలో తన భార్య బర్త్‌డేకు సీఎంతో దిగిన ఫోటో గిఫ్ట్‌గా ఇస్తానని హీరో క్యారెక్టర్ చెప్పడం చూశాం కదా..అదే రేంజ్‌లో ఫోటో కాదు..రియల్‌గా సీఎం అయ్యే చూపిస్తానంటూ త్రిషకు విజయ్ మాట ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఇది నమ్మబులా కాదా..అన్నది పక్కనపెడితే, తమిళనాట మాత్రం మే4 డేట్ అందరి మైండ్‌లో ఫిక్స్ అయ్యింది.
అమిత్‌షాతో త్రిష మీటింగ్!
తమిళనాడులో ఎన్‌డీఏ-టీవీకే పొత్తు సినీనటి త్రిష చేతుల్లో ఉందని రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పాలక డీఎంకేదే పైచేయి అని, విపక్ష ఎన్‌డీఏపై 5 శాతం ఓట్ల ఆధిక్యంతో ఉందని..విజయ్ టీవీకే పార్టీకి 12 శాతం ఓట్లు రావచ్చని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈనేపథ్యంలో.. ఎన్‌డీఏ నేతలు అప్రమత్తమయ్యారని..ఎలాగైనా విజయ్‌ను తమ వైపు తిప్పుకొనేందుకు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కరూర్ తొక్కిసలాట ఘటన వ్యవహారం విజయ్‌ను ఇప్పటికీ వెంటాడుతోంది. సీబీఐ విచారణతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ‘జననాయగన్’ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్సు రావడం లేదు. ఈ నేపథ్యంలో విజయ్‌కు సన్నిహితురాలిగా భావిస్తున్న త్రిష గత వారం ముంబైలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయినట్లు వార్తలొచ్చాయి. తర్వాత ఈ నెల 15న సీబీఐ విచారణకు హాజరైన విజయ్.. ఎలాంటి ఇబ్బందీ లేకుండా బయటకు వచ్చినట్లు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేగాక సెన్సార్ బోర్డు సైతం విజయ్ సినిమాను పునఃపరిశీలించేందుకు తాజాగా అంగీకరించినట్లు తెలుస్తోంది. త్రిష కృషి వల్లనే ఇది సాధ్యమైందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు.. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి కుమారుడు మిధున్ కూడా పలు మార్లు త్రిషతో భేటీ అయినట్లు తమిళనాడు కోడై కూస్తోంది..
మరోవైపు విజయ్ మాత్రం ఎలాంటి పొత్తులు లేవని ఇప్పటికే ప్రకటించాడు. సింగిల్‌గానే బరిలోకి దిగుతున్నామని బుధవారం కూడా క్లారిటీ ఇచ్చాడు. అయినా సరే విజయ్ పార్టీపై త్రిషతో లింక్ పెడుతూ జరుగుతున్న ప్రచారం మాత్రం తగ్గడంలేదు. ఈనేపద్యంలో ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా విజయం తమేదనంటున్నారు ఆపార్టీ లీడర్ అధవ అర్జున్
కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునేవారిని ఇక్కడున్న పార్టీలు టార్గెట్ చేస్తాయి. విజయ్‌కాంత్ గొప్ప నటుడు,దైర్యవంతుడు ఆయనరాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఆయన్ను లక్ష్యంగా చేసుకుని, ఎదగనీయకుండా చేసారు. అలాగే రజనీకాంత్‌ను చేశారు..ఇప్పుడు విజయ్‌ను చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, గెలుపు తమదే.
సొ..మొత్తానికి త్రిష చుట్టూరా ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. తనకేం సంబంధం లేకపోయినా, బహిరంగంగా ఎక్కడా కనిపించకపోయినా విజయ్‌ను విమర్శించాలంటే త్రిష కటౌట్‌ను ముందు పెట్టి ప్రత్యర్ధులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టారు. మరి చూడాలి, త్రిష సెంట్రిక్‌గా సాగుతున్న తమిళరాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




